Godrej Family : 127 ఏళ్ల చరిత్ర కలిగిన ‘గోద్రెజ్’‌లో చీలిక.. ఎవరెవరికి ఏయే వ్యాపారం ?

Godrej Family : మన దేశంలో టాటా గ్రూప్‌లాగే.. గోద్రెజ్‌ గ్రూప్ కూడా చాలా ఫేమస్.

  • Written By:
  • Publish Date - May 1, 2024 / 09:21 AM IST

Godrej Family : మన దేశంలో టాటా గ్రూప్‌లాగే.. గోద్రెజ్‌ గ్రూప్ కూడా చాలా ఫేమస్. తాళాలు, బీరువాల నుంచి మొదలుకొని సింతాల్, షీకాకాయ్, నంబర్ 1  సబ్బుల దాకా గోద్రెజ్ కంపెనీ ప్రజల్లోకి చొచ్చుకువెళ్లింది. వారి మదిని దోచేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా గోద్రెజ్ కంపెనీ తనదైన ముద్రవేస్తూ ముందుకు సాగుతోంది. 127 ఏళ్ల వ్యాపార చరిత్ర కలిగిన గోద్రెజ్ గ్రూప్(Godrej Family) త్వరలోనే రెండు భాగాలుగా విడిపోనుంది. ఈమేరకు వారి కుటుంబ సభ్యులు కంపెనీలను పంచుకోనున్నారు. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

  • గోద్రెజ్‌ గ్రూప్‌ రెండు వేర్వేరు కంపెనీలుగా విడిపోనుంది.
  • గోద్రెజ్ కుటుంబంలోని ఆది గోద్రెజ్, ఆయన సోదరుడు నాదిర్ గోద్రెజ్ ఒక వైపుగా..  వారి దాయాదులు జంషీద్ గోద్రెజ్, స్మితా గోద్రెజ్ కృష్ణ మరోవైపుగా వ్యాపారాలను పంచుకోనున్నారు.
  • ఆది గోద్రెజ్, నాదిర్ గోద్రెజ్‌లకు ఐదు లిస్టెడ్‌ కంపెనీలున్న గోద్రెజ్ ఇండస్ట్రీస్‌ దక్కనుంది.
  • గోద్రెజ్ ఇండస్ట్రీస్, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, గోద్రెజ్ అగ్రోవెట్, అస్టెక్ లైఫ్ సైన్సెస్ వంటి లిస్టెడ్ కంపెనీలను కలిగి ఉన్న గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు నాదిర్ గోద్రెజ్ చైర్‌పర్సన్‌గా ఉంటారు.
  • 2026 ఆగస్టులో నాదిర్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకుంటారు.
  • ఆది గోద్రెజ్  కుమారుడు పిరోజ్షా గోద్రెజ్ ఈ  గ్రూప్‌‌నకు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు.
  • జంషీద్ గోద్రెజ్ , స్మిత గోద్రెజ్‌లకు అన్‌లిస్టెడ్ కంపెనీ గోద్రెజ్ అండ్ బోయ్స్, దాని అనుబంధ సంస్థలు దక్కనున్నాయి. ముంబైలోని అత్యంత విలువైన ఆస్తులు, భూములు కూడా వీరికే దక్కనున్నాయి.
  • గోద్రెజ్ అండ్ బోయ్స్ కంపెనీ ఏరోస్పేస్, ఏవియేషన్‌, ఫర్నీచర్, ఐటీ సాఫ్ట్‌వేర్‌ రంగాలలో విస్తరించి ఉంది.
  • గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు జంషీద్ గోద్రెజ్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. జంషీద్ గోద్రెజ్ సోదరి స్మిత కుమార్తె నైరికా హోల్కర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంటారు.
  • ముంబైలోని 3,400 ఎకరాల విలువైన భూమి సహా ల్యాండ్ బ్యాంక్‌ను కలిగి ఉండే  గోద్రెజ్ కంపెనీ విభాగాన్ని కూడా జంషీద్ గోద్రెజ్, స్మిత గోద్రెజ్ కుటుంబాలే నియంత్రిస్తాయి.

Also Read : AP Elections : జగన్‌పై 26 మంది.. చంద్రబాబుపై 12 మంది.. షర్మిలపై 13 మంది పోటీ

కుటుంబ చరిత్ర ఇదీ.. 

  • లాయర్‌ నుంచి వ్యాపారవేత్తగా మారిన అర్దేషిర్ గోద్రెజ్, ఆయన సోదరుడు ఫిరోజ్‌షా కలిసి 1897 సంవత్సరంలో గోద్రెజ్‌ కంపెనీని స్థాపించారు.
  • అర్దేషీర్‌కు సంతానం లేకపోవడంతో ఆయన  తమ్ముడు ఫిరోజ్‌షా సంతానానికి కంపెనీ వారసత్వంగా వచ్చింది.
  • ఫిరోజ్‌షాకు నలుగురు పిల్లలు ఉన్నారు. వీరు సోహ్రాబ్, దోసా, బుర్జోర్, నావల్.
  • ఆది గోద్రెజ్, నాదిర్ గోద్రెజ్‌లు బుర్జోర్ గోద్రెజ్  కుమారులు.  జంషీద్ గోద్రెజ్, స్మిత గోద్రెజ్‌లు నావల్ గోద్రెజ్ సంతానం.
  • సోహ్రాబ్‌ గోద్రెజ్‌కు సంతానం లేదు.
  • దోసా గోద్రెజ్‌కు రిషద్‌ అనే ఒక కుమారుడు ఉండగా ఆయనకు కూడా పిల్లలు లేరు.

Also Read :Manipur Cops : మహిళలను అల్లరిమూకలకు అప్పగించింది పోలీసులే : సీబీఐ