Site icon HashtagU Telugu

Richest Indian : అంబానీని దాటేసిన అదానీ.. శ్రీమంతుల లిస్టులోకి షారుక్‌

Gautam Adani Richest Indian

Richest Indian : హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌  విడుదలైంది. ఇందులో అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ దాటేశారు. అంటే ఇప్పుడు మన దేశంలో నంబర్ 1 ధనికుడు గౌతమ్ అదానీ(Richest Indian). హురూన్‌ ఇండియా జాబితా ప్రకారం ప్రస్తుతం అదానీ వద్ద రూ.11.61 లక్షల కోట్ల నికర సంపద ఉంది. గత ఏడాది వ్యవధిలో ఆయన సంపద దాదాపు 95 శాతం పెరిగింది. ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచిన ముకేశ్ అంబానీ వద్ద రూ.10.14 లక్షల కోట్ల సంపద ఉందని నివేదిక పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join

Also Read :Japan Marriages : పెళ్లి కాని యువతులకు గుడ్ న్యూస్.. జపాన్ సరికొత్త స్కీమ్