Floater Credit Cards : ‘‘క్రెడిట్ కార్డులందు ఫ్లోటర్ క్రెడిట్ కార్డులు వేరయా’’ !! అందుకే ఇటీవల కాలంలో ఈ రకం క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిపోయింది. చిన్న ఫ్యామిలీలు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఫ్లోటర్ క్రెడిట్ కార్డులు బాగా ఉపయోగపడతాయి. ఇంతకీ ఏమిటీ క్రెడిట్ కార్డులు ? వాటిని ఎలా వాడాలి ? ఎలాంటి జాగ్రత్త చర్యలు పాటించాలి ?
Also Read :Cake Offerings Ban : ఇన్‌ఫ్లూయెన్సర్ ఓవర్ యాక్షన్.. ఆ ఆలయంలో బర్త్‌డే కేక్ నైవేద్యాలపై బ్యాన్
ఫ్లోటర్ క్రెడిట్ కార్డు అంటే?
సాధారణ క్రెడిట్ కార్డు అనేది కేవలం ఒకరికి సంబంధించినది. దీనిలోని క్రెడిట్ లిమిట్‌ను ఒకే వ్యక్తి వాడుకోవాలి. ఫ్లోటర్ క్రెడిట్ కార్డులోని లిమిట్‌ను ఒకరికి మించి వ్యక్తులు వాడుకోవచ్చు. ఇందుకోసం ఈ కార్డుతో పేర్లు, వివరాలను లింక్ చేసుకున్న వారందరికీ వేర్వేరు క్రెడిట్ కార్డులను(Floater Credit Cards) జారీ చేస్తారు. ఉదాహరణకు ఒక ఫ్లోటర్ క్రెడిట్ కార్డుకు రూ.50వేల క్రెడిట్ లిమిట్ ఉందని అనుకుందాం. ఆ కార్డుతో ముగ్గురు వ్యక్తుల పేర్లు లింకై ఉన్నాయని భావిద్దాం. వీరిలో ఒక వ్యక్తి రూ.30వేల లిమిట్‌ను వాడేసుకుంటే.. మిగతా ఇద్దరు వ్యక్తులకు రూ.20వేల లిమిట్ మిగులుతుంది. వీరందరికీ సెపరేటుగా క్రెడిట్ కార్డులు ఉన్నప్పటికీ.. లావాదేవీల వివరాలన్నీ ఒకే అకౌంటులో నమోదవుతాయి.
ఫలితంగా ఆ సమాచారాన్ని ట్రాక్ చేయడం ఈజీ అవుతుంది. ఈ కార్డును వాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అందరూ అతిగా ఖర్చులు చేస్తే.. క్రెడిట్ లిమిట్ మొత్తం త్వరగా అయిపోతుంది. ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వారికే ఇలాంటి కార్డులు ఇవ్వడం బెటర్. సింగిల్‌గా క్రెడిట్ కార్డులు ఉంటే.. వాటన్నింటికీ వేర్వేరుగా వార్షిక ఛార్జీలు కట్టాలి. ఫ్లోటర్ క్రెడిట్ కార్డులు వాడితే ఆ ఛార్జీల బెడద తప్పుతుంది. ఈ క్రెడిట్ కార్డుతో లింక్ అయి ఉన్న యూజర్ క్రెడిట్ లిమిట్‌ను ఎంతమేర వాడుకుంటే అంతమేర రివార్డ్ పాయింట్లు అకౌంటులో జమ అవుతాయి. దీనివల్ల క్యాష్‌బ్యాక్, ఎయిర్ మైల్స్, డిస్కౌంట్‌లను వాడుకోవచ్చు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.