Flipkart Big Billion Days Sale : వచ్చేస్తుంది..కొనుగోలుదారులకు పండగే

Flipkart Big Billion Days Sale : యాపిల్‌, వన్‌ప్లస్‌, శాంసంగ్‌, షావోమీ వంటి అల్ట్రా ప్రీమియం స్మార్ట్‌ ఫోన్లతో పాటు టీవీలు, స్మార్ట్‌ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు, గృహోపకరణాలపైనా భారీగా ఆఫర్లు లభించనున్నాయి

Published By: HashtagU Telugu Desk
Flipkart Big Billion Days S

Flipkart Big Billion Days S

Flipkart Big Billion Days Sale 2024 to Start on September 27 : ఈ నెల చివరి నుండి దసరా సంబరాలు మొదలుకాబోతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సంస్థలన్నీ తమ ఆఫర్లను సిద్ధం చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో ప్రముఖ ఆన్లైన్ దిగ్గజ సంస్థ Flipkart ఈ నెల 27 నుండి Big Billion Days Sale స్టార్ట్ చేయబోతుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్‌ 26 నుంచే సేల్‌ అందుబాటులోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ Big Billion Days Sale లో యాపిల్‌, వన్‌ప్లస్‌, శాంసంగ్‌, షావోమీ వంటి అల్ట్రా ప్రీమియం స్మార్ట్‌ ఫోన్లతో పాటు టీవీలు, స్మార్ట్‌ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు, గృహోపకరణాలపైనా భారీగా ఆఫర్లు లభించనున్నాయి. స్మార్ట్ టీవీల‌తో పాటు గృహోపకరణాలపై ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ 80 శాతం వరకు తగ్గింపును అందించే అవకాశం ఉంది. ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, గేమింగ్ ప‌రికాలు, గాడ్జెట్ పరికరాలపై 50 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గింపు లభించ‌నుంది.

రిఫ్రిజిరేటర్లు, 4కే స్మార్ట్ టీవీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై 75 శాతం భారీ తగ్గింపు లభించే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ సేల్‌లో భాగంగా HDFC క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుదారులకు డిస్కౌంట్‌ అందిచనున్నారు. ఫ్లిప్‌కార్ట్- యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుపైనా ఇంకాస్త డిస్కౌంట్‌ లభించనుంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ UPI చెల్లింపులతో రూ.50 తగ్గింపు, నో-కాస్ట్‌ EMI వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ప్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ద్వారా లక్ష రూపాయల వరకు రుణ సదుపాయం పొందొచ్చని పేర్కొంది. ఇంకెందుకు ఆలస్యం..ఇప్పటి నుండే మీకు ఏమేమి కావాలో లిస్ట్ రాసి పెట్టుకోండి.

Read Also : Emmy Awards 2024: ఎమ్మీ అవార్డ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసిన ది బేర్

  Last Updated: 16 Sep 2024, 12:03 PM IST