Akash Ambani : మన దేశంలో నంబర్ 1 సంపన్నుడు ముకేశ్ అంబానీ. ఆయన లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. ముకేశ్ జీవన శైలితో ముడిపడిన పలు కీలక వివరాలను స్వయంగా ఆయన కుమారుడు ఆకాశ్ అంబానీ వెల్లడించారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్‌గా ఉన్న ఆయన ముంబైలో జరిగిన టెక్ వీక్ ఈవెంట్‌లో మనసు విప్పి మాట్లాడారు.
Also Read :Elon Musk : ఎలాన్ మస్క్‌కు 14వ బిడ్డ.. ప్రపంచ కుబేరుడి సందేశం అదేనా?
మీకు స్ఫూర్తి ఎవరు ?
ఆకాశ్ అంబానీ : కచ్చితంగా మా నాన్న ముకేశ్ అంబానీయే(Akash Ambani) నాకు స్ఫూర్తిప్రదాత. ఆయన్ను చూసి నేను జీవితంలో ఎంతో నేర్చుకున్నాను. ఇప్పటికీ తనకు వచ్చిన ప్రతీ మెయిల్‌కు మా నాన్నే స్వయంగా సమాధానం ఇస్తారు. అందుకోసం ఆయన అర్ధరాత్రి 2 గంటల వరకు మేల్కొని ఉంటారు.గత నాలుగు దశాబ్దాలుగా రిలయన్స్ అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తూనే ఉన్నారు. ఇది 45వ ఏడాది.
జీవితంలో మీ ప్రాధాన్యతలు ఏమిటి ?
ఆకాశ్ అంబానీ : నేను వర్క్, లైఫ్ బ్యాలెన్స్ గురించి మా కుటుంబంలోనే నేర్చుకున్నాను. నా అతిపెద్ద ప్రాధాన్యతలు పని, కుటుంబం. ప్రతి ఒక్కరూ తమ ప్రాధాన్యతలను తెలుసుకోవాలి.
మీరు ఉద్యోగుల నుంచి ఏం ఆశిస్తారు ?
ఆకాశ్ అంబానీ : నేను మా కంపెనీ ఉద్యోగుల నుంచి మితిమీరిన పని గంటలను ఆశించను. వాళ్ల నుంచి క్వాలిటీ వర్క్ మాత్రమే కోరుకుంటాను.
కుటుంబం గురించి ఏమైనా చెబుతారా..
ఆకాశ్ అంబానీ : నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లతో టైం గడపాలంటే నాకు చాలా ఇష్టం. శ్లోక భార్యగా రావడం నా లక్. ఆమె నన్ను బాగా అర్థం చేసుకుంటుంది.
Also Read :Architect Jobs : ఆర్కిటెక్ట్‌లకు మంచిరోజులు.. భారీగా శాలరీలు.. ఎందుకు ?
ఏఐపై జియో ఎలా పనిచేయబోతోంది ?
ఆకాశ్ అంబానీ : ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ)పై రీసెర్చ్ కోసం మేం 1000 మంది డేటా సైంటిస్ట్‌లు, రీసెర్చర్‌లు, ఇంజినీర్‌లను తీసుకున్నాం. జామ్‌నగర్‌లో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ల (జీపీయూ) తయారు చేయాలని భావిస్తున్నాం. త్వరలో క్లౌడ్ పర్సనల్ కంప్యూటర్ తీసుకొస్తాం. ఈ ఏడాది చివరికల్లా జియో బ్రెయిన్ పేరుతో ఏఐ సూట్‌ను విడుదల చేస్తాం.