Site icon HashtagU Telugu

Elon Musk : తప్పుడు అకౌంటుకు రూ.43 కోట్ల ట్రాన్స్‌ఫర్.. ‘ఎక్స్’ తప్పిదంతో ఏమైందంటే ?

Musks X pays 43 CRORES to wrong BANK account

Elon Musk : ప్రపంచంలోనే అత్యంత ధనికుడు ఎలాన్‌ మస్క్‌‌కు చెందిన సోషల్ మీడియా కంపెనీ ‘ఎక్స్’ (ట్విట్టర్) పెద్ద పొరపాటు చేసింది. అసలేం జరిగిందంటే.. ఏకంగా రూ.43 కోట్లను తప్పుడు బ్యాంకు అకౌంటుకు ఎక్స్ బదిలీ చేసింది. దీని తర్వాత ఏమైందంటే..

Also Read :NIA Raids : టెర్రర్ ఫండింగ్ కేసు.. ఐదు రాష్ట్రాల్లోని 22 చోట్ల ఎన్ఐఏ సోదాలు

బ్రెజిల్ ప్రభుత్వ చట్టాలను అతిక్రమించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు ఎక్స్‌పై ఆ దేశ సుప్రీంకోర్టు రూ.43 కోట్ల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని బ్రెజిల్ సుప్రీంకోర్టు బ్యాంకు అకౌంటుకు ఎక్స్ కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పేమెంట్ చేసే క్రమంలోనే ఎక్స్ కంపెనీ(Elon Musk) పెద్ద పొరపాటు చేసింది. సుప్రీంకోర్టు బ్యాంకు అకౌంటు అనుకొని.. గుర్తు తెలియని మరో బ్యాంకు అకౌంటుకు రూ.43 కోట్లను పంపింది.

Also Read :SEBI Chief : రంగంలోకి కేంద్రం.. సెబీ చీఫ్‌కు పార్లమెంటరీ కమిటీ సమన్లు

ఈ పేమెంట్ గురించి సుప్రీంకోర్టు అధికారులను ఎక్స్ కంపెనీ అధికారులు ఆరా తీయగా.. డబ్బులు ఇంకా అందలేదని చెప్పారు. దీంతో ఖంగుతిన్న ఎక్స్ కంపెనీ అధికారులు అకౌంటు నంబరును చెక్ చేశారు. అది సుప్రీంకోర్టు అకౌంటు నంబరు కాదని ఎక్స్ కంపెనీ అంతర్గత విచారణలో తేలింది. ఆ డబ్బును వెంటనే సుప్రీంకోర్టు ఖాతాలోకి మళ్లించమని ఎక్స్ కంపెనీకి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.  ఎక్స్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఆ రూ.43 కోట్లను రికవరీ చేసి, సుప్రీంకోర్టు అకౌంటుకు పంపించే ప్రక్రియను బ్రెజిల్ ప్రభుత్వ బ్యాంకింగ్ వర్గాలు పర్యవేక్షిస్తున్నాయి. మన దేశంలోనూ గతంలో ఇలాంటి పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈవిధంగా ఎవరిదో భారీ అమౌంటు అకౌంటులోకి వచ్చిపడగానే.. పోలీసులకు సమాచారాన్ని అందించిన నిజాయితీపరులను కూడా మనం కళ్లారా చూశాం. ఏదిఏమైనప్పటికీ నిజాయితీని మించిన విలువ మరొకటి లేదు.

Also Read :Revanth Vs Nagarjuna : నాగార్జున పై రేవంత్ కక్ష్య కట్టాడా..?