Credit Card Spending : పండుగల సీజన్ ఉండటంతో అక్టోబరులో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగిపోయింది. గత నెలలో క్రెడిట్ కార్డుల యూజర్లు ఏకంగా రూ.2 లక్షల కోట్లకుపైగా ఖర్చులు చేశారు. ఈ వ్యయం సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో 14.5 శాతం మేర పెరగడం గమనార్హం. 2023 సంవత్సరం అక్టోబరుతో పోలిస్తే 2024 అక్టోబరులో క్రెడిట్ కార్డులతో జరిగిన ఖర్చులు దాదాపు 13 శాతం పెరిగాయి. ఈవివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది.
Also Read :INS Arighat : విశాఖ తీరంలో ‘ఐఎన్‌ఎస్ అరిఘాత్’ నుంచి తొలి మిస్సైల్ టెస్ట్
ఈ ఏడాది అక్టోబరులో జరిగిన క్రెడిట్ కార్డుల ఖర్చుల్లో అత్యధిక భాగం(Credit Card Spending) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లే చేశారు. ఎందుకంటే ప్రస్తుతం మన దేశంలో క్రెడిట్ కార్డుల జారీలో ఈ బ్యాంకు నంబర్ 1 ప్లేసులో ఉంది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు 2.41 లక్షల మంది క్రెడిట్ కార్డ్ కస్టమర్లు ఉన్నారు. ఎస్‌బీఐ కార్డ్స్‌కు ప్రస్తుతం 2.20 లక్షల మంది క్రెడిట్ కార్డ్ కస్టమర్లు ఉన్నారు. ఐసీఐసీఐ బ్యాంకుకు 1.38 లక్షల మంది క్రెడిట్ కార్డ్ కస్టమర్లు ఉన్నారు.
Also Read : Delhi Blast : ఢిల్లీలో అలజడి.. పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో భారీ పేలుడు
యూపీఐ లావాదేవీల్లో..
- మన దేశంలో యూపీఐ లావాదేవీలు బాగా పెరిగాయి. ఇదే సమయంలో డెబిట్ కార్డ్ లావాదేవీలు దాదాపు 8 శాతం తగ్గాయి. ఈ ఏడాది ఆగస్టులో రూ.43,350 కోట్లు విలువైన డెబిట్ కార్డ్ లావాదేవీలు జరగగా, సెప్టెంబరులో రూ.39,920 కోట్ల డెబిట్ కార్డ్ లావాదేవీలే జరిగాయి.
- ఆగస్టులో రూ.1.68 లక్షల కోట్లు విలువైన క్రెడిట్ కార్డుల లావాదేవీలు జరగగా, సెప్టెంబరులో అవి 5 శాతం పెరిగి రూ.1.76 లక్షల కోట్లకు చేరాయి.
- గత ఏడాది వ్యవధిలో యూపీఐ లావాదేవీలు బాగా పెరిగాయి.దీంతో మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ డబుల్ అయ్యాయి. 2021 మార్చిలో దేశంలో జరిగిన లావాదేవీల్లో 14 నుంచి 19 శాతం దాకా డిజిటల్ పేమెంట్స్ ఉండేవి. 2024 మార్చిలో దేశంలో జరిగిన లావాదేవీల్లో దాదాపు 48 శాతం దాకా డిజిటల్ పేమెంట్స్ ఉన్నట్లు వెల్లడైంది.
- యూపీఐ లావాదేవీలు ఏటా 75 శాతం మేర పెరుగుతూపోతున్నాయి.
- క్రెడిట్ కార్డుల లావాదేవీలతో పోలిస్తే యూపీఐ లావాదేవీలు దాదాపు 38 రెట్లు అత్యధికంగా ఉన్నాయి.