Campa Vs Pepsi Coke : ముకేశ్ అంబానీకి చెందిన సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ కాంపా (campa) దెబ్బకు పెప్సీ, కోకకోలా దిగొచ్చాయి.రూ.10కే చిన్న ప్యాక్‌లో డైట్ కూల్ డ్రింక్స్, లైట్ కూల్ డ్రింక్స్‌ను తీసుకొచ్చాయి. థమ్స్ ఆఫ్ ఎక్స్ ఫోర్స్, కోక్ జీరో, స్ప్రైట్ జీరో, పెప్సికో నో షుగర్ అనే బ్రాండ్ల పేరుతో రూ.10కే డ్రింక్స్‌ను కోకకోలా, పెప్సీ తీసుకొచ్చాయి. ఈ రెండు కంపెనీల నుంచి ఈ ధరలో డైట్ , లైట్ వేరియంట్లలో కూల్ డ్రింక్స్ రావడం ఇదే తొలిసారి. తక్కువ ధరలో వీటిని తీసుకురావడం ద్వారాా.. తమ ప్రధాన కూల్ డ్రింక్ బ్రాండ్‌లలో ధరల తగ్గింపును కోకకోలా, పెప్సీ(Campa Vs Pepsi Coke) కంపెనీలు నివారిస్తున్నాయి.
Also Read :Cash Pile : హైకోర్టు జడ్జి బంగ్లాలో నోట్ల కట్లలు.. రంగంలోకి సుప్రీంకోర్టు కొలీజియం
లో షుగర్, నో షుగర్ డ్రింక్స్ విభాగంలో..
లో షుగర్, నో షుగర్ రకాలకు చెందిన కూల్ డ్రింక్స్‌కు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు రిలయన్స్ కాంపాతో పాటు కోకకోలా, పెప్సీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ కూల్ డ్రింక్స్ 200 ఎంఎల్ ధర రూ.10 నుంచి ప్రారంభమవుతుంది. 500 ఎంఎల్ సర్వింగ్ సైజుల్లో కూడా ఈ రకం కూల్ డ్రింక్స్ అందుబాటులో ఉన్నాయి. పెప్సికో నో షుగర్ డ్రింక్ 200 ఎంఎల్ ధర రూ.10. వీటిని తొలి విడతగా ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులోకి తెచ్చారు. కాంపా 200 ఎంఎల్ బాటిల్ ధర రూ.10. 2023లో కాంపా కంపెనీ కూడా ఏపీలోనే అరంగేట్రం చేసింది.
Also Read :Tirumala : వేంకటేశ్వరస్వామి ఆస్తులను కాపాడటమే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు
కాంపా రీ ఎంట్రీతో..
భారత సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్‌లో 1980వ దశకంలో కాంపాదే హవా. 1990వ దశకంలో మన దేశంలోకి పెప్సీ, కోకాకోలా ఎంటర్ కాగానే, కాంపా బ్రాండ్ కనుమరుగైంది. ఆ తర్వాత కాంపా బ్రాండ్‌ను ప్యూర్ డ్రింక్స్ కంపెనీ నుంచి రిలయన్స్ కొనేసింది. అప్పటినుంచి ఈ విభాగంలో కోలా, పెప్సీ కంపెనీలకు కాంపా పోటీ ఇస్తోంది. మొత్తం మీద ఈ పోటీతో దేశంలోని కూల్ డ్రింక్స్ మార్కెట్ కాస్తా వేడెక్కింది.