Citibank – Axis Bank : జులై 15.. సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్లూ బీ అలర్ట్

జులై 15వ తేదీన సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డుదారులు అలర్ట్ కావాలి.

Published By: HashtagU Telugu Desk
Citibank Credit Cards Migration

Citibank – Axis Bank : జులై 15వ తేదీన సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డుదారులు అలర్ట్ కావాలి. ఎందుకంటే ఆ రోజున వారి కార్డులకు సంబంధించిన కీలక మార్పు జరగబోతోంది. సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డులన్నీ ఆ రోజున యాక్సిస్ బ్యాంకు పరిధిలోకి మైగ్రేట్ కానున్నాయి. ఈ తరుణంలో సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డులు వినియోగించేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలివీ..

We’re now on WhatsApp. Click to Join

జులై 15 నుంచి ఏం జరుగుతుంది ?

  • జులై 15వ తేదీకల్లా సిటీ బ్యాంకు(Citibank – Axis Bank) క్రెడిట్ కార్డుదారుల మొత్తం సమాచారం యాక్సిస్ బ్యాంకుకు మైగ్రేట్ అవుతుంది.
  • జులై 15 నుంచి సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డుల నిర్వహణ బాధ్యతలను యాక్సిస్ బ్యాంకు చేపడుతుంది.
  • జులై 15 నుంచి  సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డుల స్థానంలో యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల జారీ ప్రక్రియ షురూ అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది.అప్పటివరకు సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డులనే యూజర్లు వాడొచ్చు.
  •  సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డుల వినియోగదారులకు ఇప్పటికే యాక్సిస్ బ్యాంకు అకౌంటు  ఉంటే యాక్టివిటీనీ చాలా తొందరగా మొదలుపెట్టొచ్చు. యాక్సిస్ బ్యాంకు కస్టమర్ ఐడీకి సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు సమాచారం మైగ్రేట్ అవుతుంది.
  • యాక్సిస్ బ్యాంకు అకౌంటు లేనివారికి యాక్సిస్ బ్యాంకు కస్టమర్ ఐడీని క్రియేట్ చేసి అందిస్తుంది. ఆ ఐడీకి సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు సమాచారం బదిలీ అవుతుంది. ఈ సమాచారాన్ని ఎస్ఎంఎస్, ఈమెయిల్‌ ద్వారా సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు కస్టమర్లకు యాక్సిస్ బ్యాంకు పంపుతుంది.
  • ఎవరికైనా సిటీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులు రెండూ ఉంటే షరతులు వర్తిస్తాయి. ఈ రెండు క్రెడిట్ కార్డుల లిమిట్‌ను కలిపి ఒకే లిమిట్‌ను మంజూరు చేస్తారు. మీ లిమిట్ ఎంత ఉండాలనేది మీ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా నిర్ణయిస్తారు.
  • ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా పొందిన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును.. సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డులో విలీనం చేయరు.
  • సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు అనేది యాక్సిస్ బ్యాంకుకు మైగ్రేట్ అయ్యాక కూడా యూజర్లు సిటీ బ్యాంక్ ఆన్‌లైన్ ఖాతా, సిటీ మొబైల్ యాప్‌‌లను వాడొచ్చు. యాక్సిస్ బ్యాంకు అకౌంటు ఉన్నవారు వారి కస్టమర్ ఐడీ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అయి సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు లావాదేవీలు చేసుకోవచ్చు.
  • సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు(Citibank Credit Cards) నుంచి యాక్సిస్ బ్యాంకుకు మైగ్రేట్ కావడానికి కస్టమర్లు ఎలాంటి డాక్యుమెంట్లను కూడా సమర్పించాల్సిన అవసరం లేదు. ఏ పత్రాలపైనా సంతకం పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.

Read :NEET UG Counselling: లీకైన వీడియోలు నకిలీవి.. వచ్చే వారం నుంచే ‘నీట్-యూజీ’ కౌన్సెలింగ్ : కేంద్రం

  Last Updated: 11 Jul 2024, 11:13 AM IST