Cisco: కరోనా మహమ్మారి తర్వాత ఐటీ ఉద్యోగాలపై ప్రభావం కనిపిస్తోంది. కరోనా పోయి మూడేళ్ల అయిన దాని ప్రభావం ఇంకా ఉద్యోగులపై ఉంది. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించగా.. తాజాగా సిస్కో (Cisco) ఈ జాబితాలో చేరింది.
నెట్‌వర్కింగ్ దిగ్గజం సిస్కో బుధవారం ఒక పెద్ద ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 7 శాతం మందిని తొలగించాలని సిస్కో నిర్ణయించింది. సిస్కో ఇప్పుడు తన పూర్తి దృష్టిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీపై కేంద్రీకరించాలనుకుంటోంది. ఇది 2024లో సిస్కో రెండవ పెద్ద ప్రకటన. ఇంతకు ముందు కూడా చాలా మంది ఉద్యోగులకు కంపెనీ మార్గం చూపింది.
Also Read: Sugar vs Jaggery: షుగర్ వర్సెస్ బెల్లం.. ఇందులో ఆరోగ్యానికి ఏదీ మంచిదంటే..?
సిస్కో పెద్ద ప్రకటన
సిస్కో ఎంత మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ జూలై 2023 నివేదిక ప్రకారం.. సిస్కో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 84,900 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇటువంటి పరిస్థితిలో 7 శాతం చొప్పున సిస్కో 6000 మందిని తొలగించగలదని సమాచారం. అంతకుముందు ఫిబ్రవరి 2024లో కూడా సిస్కో 4000 మంది ఉద్యోగులను వారి ఉద్యోగాల నుండి తొలగించింది. సిస్కోకు త్రైమాసిక ఆదాయం $13.54 బిలియన్లకు 10 శాతం క్షీణించినప్పుడు ఈ మార్పులు సిస్కోలో కనిపిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
AIలో పెట్టుబడి పెట్టారు
కీలకమైన వృద్ధి అవకాశాలలో పెట్టుబడులు పెట్టేందుకు, తన వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడానికి సిస్కో పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను పరిశీలిస్తోందని కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. తొలగింపులు ఉన్నప్పటికీ సిస్కో CEO చక్ రాబిన్స్ ప్రకారం.. కంపెనీ నెట్‌వర్కింగ్ వ్యవస్థలు పెరుగుతాయని భావిస్తున్నారు. కంపెనీ కొత్త టెక్నాలజీల వైపు దూసుకుపోతోంది. జూన్‌లో కంపెనీ AI రంగంలో $ 1 బిలియన్ పెట్టుబడి పెట్టింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ స్ప్లంక్‌ను కంపెనీ $28 బిలియన్లకు కొనుగోలు చేసింది.