Site icon HashtagU Telugu

CIBIL Score: తొలిసారి బ్యాంకు నుంచి లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్‌!

CIBIL Score

CIBIL Score

CIBIL Score: సాధారణంగా ఎవరైనా తొలిసారిగా బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి వెళ్లినప్పుడు మొదటగా వారి సిబిల్ (CIBIL Score) స్కోరును బ్యాంక్ చూస్తుంది. ఇలాంటి సందర్భంలో సిబిల్ స్కోరు లేకపోవడం లేదా తక్కువగా ఉండటం వల్ల రుణం మంజూరు కాదు. అయితే ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ కొత్త నియమం ఏమిటో తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం- ఆర్‌బిఐ మార్గదర్శకాలు

తొలిసారిగా రుణం తీసుకునే వారికి కనీస సిబిల్ స్కోరు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం కేవలం క్రెడిట్ హిస్టరీ లేదనే కారణంతో బ్యాంక్ రుణం తిరస్కరించ‌కూడ‌ద‌ని పేర్కొంది.

ఆర్‌బిఐ బ్యాంకులకు ఇచ్చిన సలహా

ఆర్‌బిఐ తన మాస్టర్ డైరెక్షన్‌లో తొలిసారిగా రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారి ఫైల్‌ను, వారికి ఎటువంటి క్రెడిట్ రికార్డు లేదనే కారణంతో మాత్రమే తిరస్కరించవద్దని బ్యాంకులకు సలహా ఇచ్చింది. తొలిసారిగా రుణం తీసుకునే వారికి ఇది ఊరటనిచ్చే వార్త.

Also Read: Deputy CM Pawan Kalyan: కాకినాడ దేశానికే మోడల్ కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఫీజు కూడా ఎక్కువ కాదు

సిబిల్ రిపోర్టును తీసుకోవడానికి తమ నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారని తరచుగా చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. ఏ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ (CIC) కూడా రూ. 100 కంటే ఎక్కువ రుసుము వసూలు చేయకూడదు. అదే సమయంలో ప్రతి వ్యక్తికి సంవత్సరానికి ఒకసారి వారి పూర్తి క్రెడిట్ రిపోర్టును ఉచితంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఇవ్వాలని ఆర్‌బిఐ ఆదేశించింది. ఈ నియమం సెప్టెంబర్ 1, 2016 నుండి అమలులో ఉండ‌నుంది.

సిబిల్ స్కోరు అంటే ఏమిటో తెలుసుకోండి?

సిబిల్ స్కోరు లేదా క్రెడిట్ స్కోరు అనేది 300 నుండి 900 మధ్య ఉండే 3 అంకెల సంఖ్య అని తెలుసుకోండి. ఈ సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, క్రెడిట్ స్కోరు అంత మంచిదిగా పరిగణించబడుతుంది. దీనివల్ల రుణం మంజూరయ్యే అవకాశాలు అంతగా పెరుగుతాయి. ఏ విధమైన రుణ లావాదేవీలు, క్రెడిట్ కార్డు చెల్లింపులకు సంబంధించిన రికార్డు నివేదికను క్రెడిట్ రిపోర్ట్ అంటారు.

తనిఖీ తర్వాత రుణం మంజూరు అవుతుంది

తొలిసారి రుణం తీసుకునే వారికి సిబిల్ స్కోరు తప్పనిసరి కానప్పటికీ బ్యాంకులు తమ డ్యూ డిలిజెన్స్ (జాగ్రత్తగా తనిఖీ) చేయాల్సి ఉంటుంది. ఇందులో దరఖాస్తుదారుడి ఆర్థిక ప్రవర్తన, గత వాయిదాల రికార్డు, ఏదైనా రుణం సెటిల్ లేదా రీ-స్ట్రక్చర్ అయితే దాని ఆలస్య చెల్లింపు లేదా మాఫీ చేసిన రుణం వంటి అంశాలను పరిశీలిస్తారు.

Exit mobile version