Site icon HashtagU Telugu

Wage Rates For Workers: ద‌స‌రాకు ముందే కార్మికుల‌కు పండ‌గ‌లాంటి న్యూస్ చెప్పిన కేంద్రం..!

Wage Rates For Workers

Wage Rates For Workers

Wage Rates For Workers: కేంద్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలను (Wage Rates For Workers) పెంచింది. కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్ల తర్వాత నైపుణ్యం లేని (ఫ్రెష‌ర్‌) పని చేసే కార్మికుల కనీస వేతనం నెలకు రూ.20,358 అవుతుంది. సెమీ స్కిల్డ్‌కు నెలకు రూ.22,568 ఉంటుంది. ఇది కాకుండా నైపుణ్యం కలిగిన వారికి నెలకు రూ.24,804 వేతనం ఉంటుంది. అత్యంత నైపుణ్యం కలిగిన వారికి కనీస వేతనం నెలకు రూ.26,910గా ఉంటుంది. కొత్త వేతనాలు అక్టోబర్ 1, 2024 నుండి వర్తిస్తాయి.

ఢిల్లీ ప్రభుత్వం కూడా కనీస వేతనాన్ని పెంచింది

బుధవారం ఢిల్లీ ప్రభుత్వం కూడా త‌మ రాష్ట్రంలో కనీస వేతన రేట్లను మార్చిందని మ‌న‌కు తెలిసిందే. ఢిల్లీ బాధ్యతలు చేపట్టిన వెంటనే కనీస వేతనాలు పెంచుతూ ముఖ్యమంత్రి అతిశి ఉత్తర్వులు జారీ చేశారు. కనీస వేతనాల పెంపు రేట్లను ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి బుధవారం ప్రకటించారు. నైపుణ్యం లేని కార్మికులకు ఇకపై నెలకు రూ.18,066 లభిస్తుందని ముఖ్యమంత్రి అతిశి తెలిపారు. సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.19,929, నైపుణ్యం కలిగిన కార్మికులకు ఇప్పుడు నెలకు రూ.21,917 లభిస్తాయని ఢిల్లీ కొత్త ముఖ్య‌మంత్రి అతిశి చెప్పారు.

Also Read: SSC CHSL Tier 2 Exam: ఎస్ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్‌ టైర్ 2 పరీక్ష తేదీ విడుదల‌..!

ఢిల్లీలోని అతిషీ ప్రభుత్వం కనీస వేతనాల పెంపు ప్రకటన తర్వాత ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా కార్మికులకు పెద్ద కానుకగా ఇచ్చింది. గురువారం కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కనీస వేతన రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. కార్మికులకు ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికులకు వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (విడిఎ) సవరణ ద్వారా కనీస వేతనాన్ని పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. నైపుణ్యం, అనుభవం (అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్) ఆధారంగా కార్మిక మంత్రిత్వ శాఖ కనీస వేతన రేట్లను A, B, C కేటగిరీలుగా వర్గీకరించింది.

కనీస జీతం ఎంత ఉంటుంది?

కొత్త కనీస వేతన రేటు ప్రకారం జోన్ ‘ఎ’లో నిర్మాణ, స్వీపింగ్, క్లీనింగ్, లోడింగ్‌లో పనిచేసే నైపుణ్యం లేని కార్మికులకు కనీస వేతనం రోజుకు రూ.783 (నెలకు రూ. 20,358) ఉంటుందని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. సెమీ స్కిల్డ్‌కు జీతం రోజుకు రూ. 868 (నెలకు రూ. 22,568)గా నిర్ణయించబడింది. అదే సమయంలో నైపుణ్యం కలిగిన క్లరికల్, నిరాయుధ వాచ్‌మెన్‌లకు జీతం రోజుకు రూ. 954 (నెలకు రూ. 24,804), అత్యంత నైపుణ్యం, సాయుధ వాచ్‌మెన్‌లకు జీతం రోజుకు రూ. 1,035 (నెలకు రూ. 26,910)గా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.