Shashi Ruia Dies : భారతీయ వ్యాపారదిగ్గజం, ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకులు శశి రుయా కన్నుమూసారు. ఈ మేరకు ఎస్సార్ గ్రూప్ అధినేత, శశి రుయా సోదరుడు రవి రుయా ప్రకటించారు. ”మా కుటుంబ పెద్ద… రుయా, ఎస్సార్ కుటుంబానికి మార్గదర్శకుడైన శశికాంత్ రుయా గారి మృతివార్తను ఎంతో దిగ్భ్రాంతితో తెలియజేస్తున్నాము. ఆయన 81 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. సమాజ అభివృద్ది, సేవా కార్యక్రమాలపట్ల ఆయనకు ఉన్న అపారమైన నిబద్ధత లక్షలాది మందిని ప్రేరేపించింది. వారి జీవితాలపై చిరస్థాయిగా ప్రభావం చూపించింది. ఆయనలోని మానవత్వం, మంచి మనసు, అందరినీ కలుపుకుపోయేతత్వం ఒక అసాధారణమైన నాయకుడిగా నిలిపింది” అంటూ సోదరుడి మృతిపై ఎస్సార్ గ్రూప్ వ్యవస్థాపకులు రవి రుయా భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేసారు.
కాగా, శశి రుయా మృతదేహాన్ని సందర్శనార్థం రుయా హౌస్ లో వుంచారు. సాయంత్రం 4 గంటలకు హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనునన్నారు. కుటుంబసభ్యుడిని కోల్పోయిన రుయా ఫ్యామిలీకి వ్యాపార,రాజకీయ ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు… శశి రుయా మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, కుటుంబ సభ్యులతో పాటు ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకులు రుయా. శశికాంత్ రుయా యొక్క అద్భుతమైన వారసత్వం అతని సూత్రాలను కొనసాగిస్తూ మరియు అతని ఆశయాలను నెరవేరుస్తున్నందున అతని అద్భుతమైన వారసత్వం స్ఫూర్తిగా కొనసాగుతుందని కుటుంబ అధికారిక ప్రకటన పేర్కొంది. ప్రారంభంలో, ఎస్సార్ నిర్మాణం మరియు ఇంజనీరింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించింది. వంతెనలు, ఆనకట్టలు మరియు విద్యుత్ సౌకర్యాలతో సహా ముఖ్యమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. సంస్థ 1980లలో తన కార్యకలాపాలను విస్తరించింది. వివిధ చమురు మరియు గ్యాస్ కొనుగోలు ద్వారా ఇంధన రంగంలోకి ప్రవేశించింది.
Read Also: Gautam Gambhir : స్వదేశానికి గౌతం గంభీర్.. మళ్లీ ఆస్ట్రేలియాకు వెళ్లేది అప్పుడే..
