IndiGo:ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో(domestic ways) బిజినెస్ క్లాస్ సీట్ల(Business class seats)ను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. నవంబరు మధ్య నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. సంస్థ కార్యకలాపాలు ప్రారంభమై 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విషయాలు వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join.
కొత్తగా ప్రవేశపెట్టనున్న బిజినెస్ క్లాస్ టికెట్లు మంగళవారం నుంచే బుకింగ్‌కు అందుబాటులోకి వస్తాయని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా మాత్రమే దేశీయ మార్గాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ‘ఇండిగో బ్లూచిప్’ పేరిట కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్‌ను కూడా తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
కాగా, ఈ ఆర్థిక సంవత్సరం మరో ఏడు అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇండిగో తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థ రోజూ 2,000 విమాన సర్వీసులను 120 గమ్యస్థానాలకు నడుపుతోంది. వీటిలో 33 విదేశీ నగరాలున్నాయి. దేశీయ విమానయాన సర్వీసులలో ఇండిగో మార్కెట్ వాటా 61 శాతం. జూన్ చివరి నాటికి ఈ కంపెనీ వద్ద 382 విమానాలున్నాయి. వీటిలో 18 లీజుపై తీసుకున్నారు. 2025లో A321 XL రకం, 2027లో A350 వైడ్ బాడీ రకానికి చెందిన కొత్త విమానాలు అందనున్నాయి.