Site icon HashtagU Telugu

BSNL : దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ eసిమ్ సేవలు

Bsnl

Bsnl

దేశంలో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) ఆధునిక సాంకేతికత వైపు మరొక అడుగు వేసింది. యూజర్లకు ఇకపై ఇ-సిమ్ (eSIM) కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. టాటా కమ్యూనికేషన్స్‌తో భాగస్వామ్యం చేసుకుని ఈ సేవలను అందించనుంది. దీంతో ఇకపై యూజర్లు ఫిజికల్ సిమ్ కార్డుల అవసరం లేకుండా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునే అవకాశం లభించనుంది. ఈ నిర్ణయంతో బీఎస్ఎన్ఎల్ సాంకేతికంగా ప్రైవేట్ టెలికం సంస్థలకు సమానంగా పోటీ ఇవ్వగలదని భావిస్తున్నారు.

Immunity Boosters: వర్షాలు ఎక్కువగా పడుతున్నాయా.. అయితే రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ పండ్లు తినాల్సిందే!

ఇ-సిమ్ ద్వారా కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చని టాటా కమ్యూనికేషన్స్ వెల్లడించింది. ఈ సదుపాయం వల్ల సిమ్ మార్పు, పోర్టబిలిటీ వంటి సమస్యలు తక్కువవుతాయి. అలాగే 2G, 3G, 4G నెట్‌వర్క్‌లలో ఉన్న యూజర్లు కూడా ఈ ఇ-సిమ్** ను సులభంగా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం తమిళనాడులో ప్రారంభమైందని, త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.

ఇ-సిమ్ సేవలతో యూజర్లకు సౌకర్యం, భద్రత, సాంకేతిక ఆధిక్యం లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్లతో పాటు స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు వంటి పరికరాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ వినియోగం సులభమవుతుంది. ఈ కొత్త సదుపాయం ద్వారా బీఎస్ఎన్ఎల్ మార్కెట్లో తిరిగి తన స్థాయిని పెంచుకోవచ్చని అంచనా. అంతేకాదు, ఈ సర్వీస్ వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల వినియోగదారులకు స్మార్ట్ టెక్నాలజీ మరింత చేరువ కానుంది.

Exit mobile version