VIP Number: మీకు వీఐపీ ఫోన్ నంబర్ కావాలా ? అయితే.. దాన్ని ఈజీగా పొందండి. నచ్చిన వీఐపీ నంబరును ఆన్‌లైన్‌లో నేరుగా ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కల్పిస్తోంది. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Jay Shah : అమిత్‌షా కుమారుడి పేరుతో బీజేపీ ఎమ్మెల్యేలకు ఫోన్.. దొరికిన మోసగాడు
ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి..
తమ కస్టమర్ల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీ ‘CYMN’ పేరుతో ప్రత్యేక సేవను అందిస్తోంది. CYMN అంటే “నచ్చిన మొబైల్ నంబర్‌ను(VIP Number) ఎంచుకోండి” అని అర్థం. దేశవ్యాప్తంగా ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఈ నంబరును ఎంపిక చేసుకోవచ్చు. http://cymn.bsnl.co.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వీఐపీ నంబరును పొందొచ్చు. ఈ పోర్టల్‌లోకి వెళ్లి, రాష్ట్రం పేరును, జోన్ పేరును ఎంపిక చేసుకోవాలి. తదుపరిగా రెండు నిలువు వరుసల్లో ఫోన్ నంబర్లు కనిపిస్తాయి. ఒక నిలువు వరుసలో సాధారణ ఫోన్ నంబర్లు ఉంటాయి. మరొక నిలువు వరుసలో ఫ్యాన్సీ ఫోన్ నంబర్లు ఉంటాయి. వీటిలో మనకు నచ్చిన నంబరును ఎంపిక చేసుకోవచ్చు. ఒక వ్యక్తికి ఒకేసారి VIP నంబర్‌ను కేటాయిస్తారు. ఈ సౌకర్యం BSNL GSM (సిమ్ కార్డ్ ఆధారిత) కస్టమర్లకు మాత్రమే.
Also Read :Qatar King : రేంజే వేరప్ప.. ఖతర్ రాజు కళ్లు చెదిరే సంపద
ఫీజును చెల్లించి..
http://cymn.bsnl.co.in/ వెబ్‌సైట్‌లో వీఐపీ నంబరును ఎంపిక చేసుకోగానే, పేమెంట్ చేయాలి. ఆ వెంటనే BSNL నుంచి 7 అంకెల పిన్ వస్తుంది. అది 4 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. తదుపరిగా మీరు BSNL కస్టమర్ కేర్ లేదా సమీపంలోని ఏదైనా BSNL సర్వీస్ బ్రాంచ్‌ను సంప్రదించాలి.అక్కడికి వెళ్లి ఫ్యాన్సీ నంబర్‌కు ఫీజును చెల్లించి, అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసుకోవాలి. చాలామందికి ఫ్యాన్సీ ఫోన్ నంబర్లపై ఆసక్తి ఉంటుంది. అలాంటి వారు తప్పకుండా ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. జియో, ఎయిర్ టెల్‌లు కూడా ఈ తరహాలో ఫ్యాన్సీ నంబర్లను కేటాయిస్తున్నాయి.