Blinkit Ambulance : క్విక్ కామర్స్ సర్వీస్ కంపెనీ బ్లింకిట్ మరో కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టింది. 10 మినట్స్ అంబులెన్స్ డెలివరీ సేవలను బ్లింకిట్ మొదలుపెట్టింది. అయితే తొలి విడతగా ఈ సేవలను ఇవాళ గుర్గావ్ నగరంలో ప్రారంభించింది. ఇందుకోసం గుర్గావ్ నగరంలోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో ఐదు అంబులెన్సులను బ్లింకిట్ మోహరించింది. రానున్న రోజుల్లో దేశంలోని మరిన్ని నగరాలకు బ్లింకిట్ అంబులెన్స్ సేవలను విస్తరిస్తామని కంపెనీ సీఈఓ అల్బిందర్ ధిండ్సా(Blinkit Ambulance) వెల్లడించారు.
Also Read :BR Ambedkar : ఆర్ఎస్ఎస్ శాఖలో అంబేద్కర్ ప్రసంగించారు.. ఆర్ఎస్ఎస్ సంచలన ప్రకటన
రాబోయే రెండేళ్లలో దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో తమ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. తమ అంబులెన్సులలో బేసిక్ లైఫ్ సపోర్ట్‌కు అవసరమైన అన్ని పరికరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. బ్లింకిట్ అంబులెన్సులలో ఆక్సీజన్ సిలిండర్లు, ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్స్(ఏఈడీలు), స్ట్రెచర్లు, మానిటర్లు, సక్షన్ మెషీన్లు, ఎమర్జెన్సీ మెడిసిన్లు ఉంటాయి. ప్రతీ అంబులెన్సులో శిక్షణ పొందిన పారామెడిక్‌లు, అసిస్టెంట్లు, ప్రొఫెషనల్ డ్రైవర్లు ఉంటారు.
Also Read :Earthquake : ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో మరోసారి భూకంపం
ప్రైవేటు అంబులెన్సుల వాళ్లు ప్రజలను దోచుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఈ విభాగంలోకి బ్లింకిట్ ప్రవేశించడం అనేది కీలకమైన అంశమే. ఇతర ప్రైవేటు అంబులెన్సుల కంటే సరసమైన సర్వీసు ఛార్జీలకు సేవలను అందిస్తే బ్లింకిట్ అంబులెన్సు సేవల బిజినెస్ భారీగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు ఎవరైనా చికిత్స పొందుతూ చనిపోతే.. వారి డెడ్ బాడీని ఇళ్లకు తీసుకెళ్లేందుకు ప్రైవేటు అంబులెన్సుల నిర్వాహకులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇతర వాహనాల్లో డెడ్‌బాడీలను తరలించకుండా అడ్డుకుంటున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో ప్రైవేటు అంబులెన్సులను ప్రజలు అత్యవసరం కోసం బుక్ చేసుకున్నా భారీగానే డబ్బులు గుంజుతున్నారు. ప్రైవేటు అంబులెన్సుల ఛార్జీల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.