Rail Neer Prices: రైలు ప్రయాణికులకు శుభవార్త. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే బోర్డు రైల్ నీర్ (Rail Neer Prices) ధరలను తగ్గించాలని నిర్ణయించింది. ఈ ధరల తగ్గింపు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు రైల్వే బోర్డు శనివారం ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ధరల వివరాలు
- 1 లీటరు రైల్ నీర్: ప్రస్తుతం ఉన్న రూ. 15 నుంచి రూ. 14కి తగ్గించబడుతుంది.
- 500 మి.లీ రైల్ నీర్: ప్రస్తుతం ఉన్న రూ. 10 నుంచి రూ. 9కి తగ్గించబడుతుంది.
జీఎస్‌టీ ప్రభావం
రైల్వే మంత్రిత్వ శాఖ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారులకు జీఎస్‌టీ (GST) తగ్గింపు ప్రయోజనాలను నేరుగా అందించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానున్న కొత్త జీఎస్‌టీ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ధరల సవరణ జరిగినట్లు తెలిపింది.
Also Read: Dadasaheb Phalke Award: సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు!
ఇతర కంపెనీల నీళ్ల ధరలు కూడా తగ్గుతాయి
రైల్వే బోర్డు తమ నోటిఫికేషన్‌లో ఐఆర్‌సీటీసీ/రైల్వే ఎంపిక చేసిన ఇతర బ్రాండ్ల ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్ల గరిష్ట రిటైల్ ధరలను కూడా సవరిస్తున్నట్లు పేర్కొంది. దీని ప్రకారం ఇతర కంపెనీల ధరలు గురించి తెలుసుకుందాం.
- 1 లీటరు బాటిల్: రూ. 15 నుంచి రూ. 14కి తగ్గించబడుతుంది.
- 500 మి.లీ బాటిల్: రూ. 10 నుంచి రూ. 9కి తగ్గించబడుతుంది.
ఐఆర్‌సీటీసీకి భారీ లాభాలు
భారత రైల్వేల అనుబంధ సంస్థ అయిన ఐఆర్‌సీటీసీ (IRCTC) రైల్ నీర్‌ను తయారు చేసి రైల్వే స్టేషన్లు, రైళ్లలో విక్రయిస్తుంది. ఇతర కంపెనీల నీళ్ల బాటిళ్లు రూ. 20కి అమ్ముడవుతుంటే ఐఆర్‌సీటీసీ తన రైల్ నీర్‌ను కేవలం రూ. 15కే విక్రయిస్తుంది. రైల్ నీర్ అమ్మకాల ద్వారా ఐఆర్‌సీటీసీ ప్రతి సంవత్సరం భారీ లాభాలు పొందుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం రైల్ నీర్ అమ్మకాల ద్వారానే రూ. 46.13 కోట్ల లాభం ఆర్జించినట్లు కంపెనీ తెలిపింది.
