Trillion Dollars : వారెన్ బఫెట్.. అంటేనే ఒక సంచలనం. ఆయనకు చెందిన కంపెనీ పేరు ‘బెర్క్‌షైర్ హాత్‌వే’. ఈ కంపెనీ తాజాగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అదేమిటంటే.. ‘బెర్క్‌షైర్ హాత్‌వే’ కంపెనీ మార్కెట్ విలువ రూ.83 లక్షల కోట్లు (Trillion Dollars)ను దాటేసింది. అమెరికాలో ఇప్పటిదాకా యాపిల్, ఎన్‌విడియా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, మెటా వంటి బడా టెక్ కంపెనీలు మాత్రమే ఇంతటి వ్యాల్యూను సాధించాయి. తొలిసారిగా ఈ రేంజుకు విలువను పెంచుకున్న అమెరికన్ నాన్-టెక్ కంపెనీగా ‘బెర్క్‌షైర్ హాత్‌వే’ రికార్డును సొంతం చేసుకుంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌ఛేంజీలో ‘బెర్క్‌షైర్ హాత్‌వే’ కంపెనీ షేరు ధర రూ.39వేలకు చేరింది.
We’re now on WhatsApp. Click to Join
‘బెర్క్‌షైర్ హాత్‌వే’ కంపెనీ తొలుత వస్త్ర తయారీ పరిశ్రమలో తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఆ తర్వాత క్రమక్రమంగా వివిధ రంగాల్లోకి తన కార్యకలాపాలను విస్తరించింది. ‘బెర్క్‌షైర్ హాత్‌వే’ కంపెనీ 1965 సంవత్సరం నుంచి ఏటా 20 శాతం మేర వృద్ధిని సాధించింది. ప్రధానంగా ఈ ఏడాది యాపిల్ కంపెనీలోని తన వాటాను వారెన్ బఫెట్ అమ్మేశారు. దీంతో ఒక్కసారిగా భారీ ఫండ్స్ ఆయన కంపెనీ చేతిలోకి వచ్చాయి. ఫలితంగా ‘బెర్క్‌షైర్ హాత్‌వే’ కంపెనీ మార్కెట్ విలువ రూ.83 లక్షల కోట్లకు చేరుకుంది.
Also Read :Telugu Language Day : ఇవాళ తెలుగు భాషా దినోత్సవం.. ఈరోజు ప్రత్యేకత తెలుసా ?
ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో యాపిల్ కంపెనీలోని తన వాటాలో సుమారు సగం వాటాను బెర్క్‌షైర్ హాత్‌వే విక్రయించింది. దీంతో యాపిల్ కంపెనీలో బెర్క్‌షైర్ హాత్‌వే వాటా 2.6 శాతానికి తగ్గింది. ఒకప్పుడు యాపిల్‌లో వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్‌వే వాటా సగం ఉండేది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నేపథ్యంలో వారెన్ బఫెట్ సారధ్యంలోని బెర్క్‌షైర్ హాత్‌వే.. శరవేగంగా నగదు నిల్వలను పెంచుకుంటోంది. మరోవైపు బిల్‌గేట్స్‌కు కూడా వారెన్ బఫెట్ షాకిచ్చారు. తాను కాలం చేసిన తర్వాత బిల్‌గేట్స్ ఫౌండేషన్‌కు బెర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ నుంచి విరాళాలు అందకపోవచ్చని ఆయన ప్రకటించారు. ఎందుకంటే తన వారసులు సొంతంగా స్వచ్ఛంద సేవా కార్యకలాపాలను చేసే ఆలోచనలో ఉన్నారని స్పష్టం చేశారు.