Banks Big Changes : ఇవాళ (ఫిబ్రవరి 1) కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన కోసం యావత్ దేశంలోని బ్యాంకింగ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆ కీలక ప్రకటన గనక వెలువడితే.. కేవలం బ్యాంకు సిబ్బందే కాదు, బ్యాంకుకు వెళ్లే ప్రతీ ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. ఇంతకీ ఆ సమాచారమేంటో ఈ కథనంలో చూద్దాం..
Also Read :AP Gold Hub : దేశంలోనే అతిపెద్ద గోల్డ్‌హబ్ ఏపీలో.. ఏమేం ఉంటాయంటే..
కొత్త టైమింగ్స్ ఇలా ?
బ్యాంకు ఉద్యోగులు, వారికి సంబంధించిన ఉద్యోగ సంఘాలు చాలా ఏళ్లుగా ఒక డిమాండ్‌ను వినిపిస్తున్నాయి. తమకు వారానికి 5 రోజుల పనిదినాలను అమలు చేయాలని కోరుతున్నాయి. ప్రతివారం 2 రోజులు సెలవులు ఉండేలా చూడాలని అంటున్నారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో దీనిపై ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నారు. అయితేే ఒక ట్విస్ట్ ఉంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలను కేటాయిస్తే.. వారు ప్రతిరోజూ పనిచేసే టైమింగ్స్‌ను కొంతమేర పెంచనుంది. ప్రతిరోజూ దాదాపు 40 నిమిషాలు బ్యాంకు ఉద్యోగులు అదనంగా వర్క్ చేయాలి. అలా చేస్తే వారానికి 5 రోజుల పనిదినాలను కేటాయించేందుకు మోడీ సర్కారు రెడీగానే ఉందట. ప్రతిరోజూ 40 నిమిషాలు చొప్పున ఐదు రోజుల వ్యవధిలో బ్యాంకు ఉద్యోగులు దాదాపు మూడున్నర గంటల పాటు అదనంగా వర్క్ చేస్తారు. ఇందుకు ప్రతిగా ఒక వర్కింగ్ డేను కేంద్ర సర్కారు తగ్గిస్తుంది. ప్రతి శనివారం, ఆదివారం బ్యాంకులు మూసిఉంటాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు బ్యాంకు శాఖలు ఉదయం 9:45 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పనిచేస్తాయి. అసలు కేంద్ర బడ్జెట్‌లో దీనిపై ప్రకటన వెలువడుతుందా ? లేదా ? అనేది వేచిచూడాలి. బ్యాంకుల పనిదినాలు తగ్గినా ప్రజలపై పెద్దగా ప్రభావమేమీ ఉండదు. ఇటీవల కాలంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వినియోగం గణనీయంగా పెరిగింది. దాన్ని ప్రజలు వాడుకుంటారు.
Also Read :Padma Awards 2025 : పద్మ అవార్డులపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వ బ్యాంకులకు పెనుముప్పు
బ్యాంకు ఉద్యోగులు(Banks Big Changes) ప్రస్తుతం రోజూ దాదాపు 8 గంటలు పనిచేస్తున్నారు. ఉదయం వేళల్లో వర్కింగ్ యాక్టివిటీని లేట్‌గా ప్రారంభిస్తారని, సాయంత్రం వేళ వర్కింగ్ యాక్టివిటీని త్వరగా క్లోజ్ చేస్తారనే అపవాదు ప్రభుత్వ బ్యాంకులపై ఉంది. ఈవిధమైన పనితీరు వల్లే ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్ర సర్కారు అడుగులు వేస్తోందనే టాక్ ఉంది. ఇప్పటికే చాలా ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేశారు. రానున్న కాలంలో చాలావరకు ప్రభుత్వ బ్యాంకుల పెట్టుబడుల ఉపసంహరణ జరగనుంది. ఐడీబీఐ బ్యాంకులో ఈ ప్రక్రియ 2023 సంవత్సరంలోనే షురూ అయింది. తదుపరిగా మిగతావి కూడా ఈ క్యూలోకి చేరుతాయి. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగుల టైమింగ్స్‌పై కంటే వర్క్ నాణ్యతను పెంచుకోవడంపై, ప్రైవేటీకరణ జరగకుండా బ్యాంకులను కాపాడుకోవడంపై శ్రద్ధ పెడితే బాగుంటుంది.