Site icon HashtagU Telugu

SBI Credit Card Customers : క్రెడిట్ కార్డ్ వాడే వారికీ బ్యాడ్ న్యూస్

Sbi Credit Card

Sbi Credit Card

SBI క్రెడిట్ కార్డు వినియోగదారులకు (SBI Credit Card Customers ) బ్యాడ్ న్యూస్. మార్చి 31, 2025 తర్వాత SBI క్రిడెట్ కార్డు లో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. SBI దేశంలో రెండో అతిపెద్ద క్రెడిట్ కార్డ్ జారీ సంస్థ. తన రివార్డ్ పాయింట్ల విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా క్లబ్ విస్తారా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్, ఎయిరిండియా ఎస్బీఐ ప్లాటినమ్, ఎయిరిండియా సిగ్నేచర్, సింప్లీక్లిక్ ఎస్బీఐ కార్డ్ వంటి కార్డులపై రివార్డ్ పాయింట్లు తగ్గిస్తుంది. అంతే కాకుండా కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను కూడా తొలగించారు. ఉచిత విమాన టికెట్ వోచర్లను రద్దు చేయడం, స్విగ్గీ, ఎయిరిండియా టికెట్ బుకింగ్స్‌పై రివార్డ్ పాయింట్లను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ మార్పులు వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

JNV Result 2025: జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా!

క్లబ్ విస్తారా ఎస్బీఐ కార్డులకు సంబంధించి ఎకానమీ, ప్రీమియం ఎకానమీ టికెట్ వోచర్‌లు ఇకపై అందుబాటులో ఉండవు. ముందుగా రూ. 1.25 లక్షలు, రూ. 2.5 లక్షలు, రూ. 5 లక్షలు ఖర్చు చేసినప్పుడు ఈ వోచర్లు లభించేవి. కానీ ఏప్రిల్ 1, 2025 తర్వాత అవి తొలగించబడతాయి. అయితే వినియోగదారులకు పునరుద్ధరణ సమయంలో రూ. 2,999 ఫీజును రద్దు చేయడం ద్వారా కొంత రాయితీ ఇస్తున్నారు. అదేవిధంగా సింప్లీక్లిక్ ఎస్బీఐ కార్డు వినియోగదారులకు స్విగ్గీ ఆన్‌లైన్ లావాదేవీలపై 10X రివార్డ్ పాయింట్లకు బదులుగా 5X మాత్రమే అందిస్తారు. అయితే Apollo 24X7, బుక్‌మైషో, క్లియర్‌ట్రిప్, డామినోస్, మింత్రా, యాత్రా వంటి వేదికలపై కొనుగోళ్లకు మాత్రం 10X రివార్డ్ పాయింట్లు కొనసాగనున్నాయి.

Fine Rice Price : తెలంగాణలో దిగివస్తున్న సన్న బియ్యం ధరలు

ఎయిరిండియా ఎస్బీఐ ప్లాటినమ్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు, ఎయిరిండియా వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకుంటే రూ. 100కు 15 రివార్డ్ పాయింట్లకు బదులుగా 5 మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇదే విధంగా ఎయిరిండియా ఎస్బీఐ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే, రూ. 100కు 30 రివార్డ్ పాయింట్లకు బదులుగా 10 మాత్రమే లభిస్తాయి. అంటే రివార్డ్ పాయింట్లు గణనీయంగా తగ్గించబడతాయి. ఈ మార్పులు క్రెడిట్ కార్డు వినియోగదారుల ప్రయోజనాలను తగ్గించే విధంగా ఉండటంతో, ఇప్పటికే SBI క్రెడిట్ కార్డులు వాడుతున్నవారు ఈ మార్పులను గమనించి తగిన చర్యలు తీసుకోవడం మంచిది.

Exit mobile version