Anant Ambani : అపర కుబేరుడు, వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల టైం సమీపిస్తోంది. ఈ వివాహ ఘట్టం ప్రారంభోత్సవాలు మే 29న ఇటలీలో ప్రారంభమై జూన్ 1న స్విట్జర్లాండ్‌లో ముగియనున్నాయి. ఈ వేడుకలకు దాదాపు 800 మంది అతిరథ మహారథులు హాజరుకానున్నారు. ఈ ఈవెంట్‌ను భారీ లగ్జరీ షిప్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
అతిథులు మే 29న ఇటలీలోని సిసిలీ నుంచి క్రూయిజ్ షిప్(Anant Ambani) ఎక్కి స్విట్జర్లాండ్ లో దిగనున్నారు. మూడు రోజుల పాటు ఈ భారీ షిప్ లోనే వివాహ వేడుక జరుగనుంది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఆకాష్ అంబానీ మినహా మిగిలిన అంబానీ కుటుంబ సభ్యులంతా క్రూయిజ్ పార్టీ ఫిట్టింగ్‌ల కోసం లండన్‌లోనే ఉన్నారని తెలుస్తోంది. ఈ షిప్‌లో అతిథులను అలరించడానికి దాదాపు 600 మంది సిబ్బంది ఉంటారు. ఈ షిప్‌లో జరిగే ఈవెంట్లలో పాల్గొనే స్టార్ల జాబితాలో షారుఖ్ ఖాన్,రణబీర్ కపూర్-అలియా భట్, సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారని తెలుస్తోంది. ప్రియాంక చోప్రా, జోనాస్ దంపతులు, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే దంపతులు, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, సోనమ్ కపూర్ సైతం అతిథులుగా విచ్చేయనున్నారు. కీలకమైన వివాహ కార్యక్రమం ముంబై వేదికగా జూలై 6 నుంచి 12వ తేదీ వరకు జరుగుతుంది.