Amazon Summer Sale 2024 : గ్రేట్ సమ్మర్‌ సేల్‌కు సిద్దమైన అమెజాన్..డిస్కౌంట్ లే డిస్కౌంట్లు

ఈ సేల్‌లో భాగంగా ICICI, వన్ కార్డు, బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్/క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు ఇవ్వనుంది

  • Written By:
  • Publish Date - April 27, 2024 / 08:11 PM IST

ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో కస్టమర్లకు తీపి కబురు తెలిపే అమెజాన్ (Amazon)..ఈసారి సమ్మర్ సేల్ (Amazon Summer Sale 2024) ను భారీ డిస్కౌంట్ లతో రాబోతుంది. మే 2 నుండి ఈ సేల్ ప్రారంభం కాబోతుండగా..అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రం ఒక రోజు ముందే అంటే మే 1న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ సేల్ ప్రారంభం కాబోతుంది. ఈసారి ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ తో పాటు పలు రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందించబోతుంది. అంతే కాదు OnePlus, Redmi, Samsung, టెక్నో, ఐఫోన్ వంటి టాప్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు ఇవ్వనున్నట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

అమెజాన్‌కు చెందిన అలెక్సా ఉత్పత్తులు, ప్రముఖ బ్రాండ్లకు చెందినటువంటి ఫ్యాషన్ ఉత్పత్తులు, ఇంటికి అవసరం అయ్యే వస్తువులు, స్మార్ట్‌టీవీలు మొదలగు వాటిని ఈ సేల్‌లో భారీ తగ్గంపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ మే 9 వరకు ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా ICICI, వన్ కార్డు, బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్/క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు ఇవ్వనుంది. అంతే కాదు కొనుగోలు సమయంలో మొదటి ఆర్డర్‌ను ఫ్రీగా డెలివరీ చేయడంతో పాటు వెల్‌కమ్‌ రివార్డ్‌ పేరిట 20 శాతం క్యాష్‌ బ్యాక్‌ కూడా ఇస్తామని అమెజాన్ తెలిపింది.

Read Also : Hyderabad: హైదరాబాద్ లో పోలీసుల తనిఖీలు.. భారీగా గంజాయి, డబ్బులు స్వాధీనం