Air India: టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ ‘ఎయిర్ ఇండియా’ (Air India) తమ ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన సంవత్సర కానుకను అందించింది. దేశీయ రూట్లలో విమానాల్లో Wi-Fi సదుపాయాన్ని ప్రారంభించిన దేశంలోనే మొదటి ఎయిర్‌లైన్‌గా అవతరించినట్లు ఎయిర్ ఇండియా జనవరి 1, 2025న తెలిపింది. అంటే ఇప్పుడు మీరు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించేటప్పుడు కూడా మీ ఫోన్‌లో ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయగలుగుతారు.
ఈ విమానాల్లో అందుబాటులోకి వచ్చింది
దేశీయ విమానాల్లో ఇన్-ఫ్లైట్ వై-ఫై కనెక్టివిటీని అందించడం ప్రారంభించినట్లు ఎయిర్ ఇండియా బుధవారం ప్రకటించింది. దీంతో భారత్‌లో ఈ ఘనత సాధించిన తొలి విమానయాన సంస్థగా అవతరించింది. కంపెనీ ప్రకారం.. Airbus A350, Boeing 787-9, Airbus A321neo విమానాలలో ప్రయాణీకులు 10,000 అడుగుల పైన ఎగురుతున్నప్పుడు ఇంటర్నెట్‌ను ఆస్వాదించగలరు.
Also Read: Manmohan Singh Memorial: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకాన్ని ఎక్కడ నిర్మించనున్నారు?
దేశీయ విమాన ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, ప్రయాణికులకు సౌకర్యవంతంగా చేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇప్పుడు ఎయిర్ ఇండియా ప్రయాణీకులు 10,000 అడుగుల ఎత్తులో ప్రయాణించేటప్పుడు కూడా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయగలరు. iOS లేదా Androidతో కూడిన ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లలో ఉచిత Wi-Fi యాక్సెస్ అందుబాటులో ఉంటుంది.
ఎయిర్ ఇండియా ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ రూట్లలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్‌లకు ఎయిర్ ఇండియా విమానాలలో Wi-Fi సేవ అందుబాటులో ఉంది. తమ నూతన సంవత్సర కానుకను ప్రయాణికులు ఆదరిస్తారని ఎయిర్‌లైన్ ఆశాభావం వ్యక్తం చేసింది. విమానంలో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం వల్ల ప్రయాణీకులకు సమయం గడపడం కష్టంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ విమానాల్లో దీన్ని ప్రారంభించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది.
విమానంలో Wi-Fiని ఎలా ఉపయోగించాలి?
- మీ ఫోన్‌లో Wi-Fiని ప్రారంభించడానికి సెట్టింగ్‌లకు వెళ్లండి.
- దీని తర్వాత ఎయిర్ ఇండియా ‘వై-ఫై’ నెట్‌వర్క్‌ని ఎంచుకోండి.
- ఎయిర్ ఇండియా పోర్టల్‌కి వెళ్లినప్పుడు మీ PNR, ఇంటిపేరును నమోదు చేయండి.
- దీని తర్వాత మీరు ఉచిత ఇంటర్నెట్‌ను ఆస్వాదించగలరు.