Site icon HashtagU Telugu

Wife Vs Sundays : భార్యలు వర్సెస్ సండేస్.. తన భార్యను ప్రస్తావిస్తూ అదర్ పూనావాలా రియాక్షన్

Adar Poonawalla Natasha Poonawalla wife Vs Sundays

Wife Vs Sundays : ‘‘ఔను.. నా భార్యకు కూడా నేను చాలా అద్భుతంగా కనిపిస్తుంటాను. ఆమె ప్రతీ ఆదివారం నన్ను చూస్తూ ప్రేమిస్తుంటుంది. ఎంత పనిచేశామనే దాని కంటే ఎంత నాణ్యంగా పని చేశామన్నదే ముఖ్యం. ఉద్యోగుల పని, జీవితం రెండింటినీ బ్యాలెన్స్ చేయడంపై కంపెనీలు ఫోకస్ పెట్టాలి’’ అని అదర్ పూనావాలా కామెంట్ చేశారు. మహారాష్ట్రలోని పూణే కేంద్రంగా పనిచేసే ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ కంపెనీ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఈయన సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులు ప్రతివారం 90 గంటలు పనిచేయాలంటూ ఎల్‌ అండ్‌ టీ గ్రూపు ఛైర్మన్‌ సుబ్రమణ్యన్ చేసిన వ్యాఖ్యలపై అదర్ పూనావాలా ఈమేరకు స్పందించారు. ఈ అంశంపై ఇటీవలే ఆనంద్‌ మహీంద్రా చేసిన వ్యాఖ్యలతో అదర్ ఏకీభవించారు. ఎక్కువ పనిగంటలతో పెద్దగా ఒరిగేదేం ఉండదన్నారు.

Also Read :Election Code : ‘ఎన్నికల కోడ్‌‌’తో ఆటంకమా ? ‘జమిలి’ బిల్లులోని ప్రతిపాదనపై ఈసీ ఫైర్

భార్యను చూస్తూ ఉండటం నాకెంతో ఇష్టం

‘‘వారానికి 48 గంటలు, 70 గంటలు, 90 గంటలు.. ఇలా ఎన్ని గంటలు పని చేశామన్నది ముఖ్యం కానే కాదు. ఎంత బాగా పనిచేశాం.. ఎంత ప్రొడక్టివిటీ ఇచ్చాం అన్నది మాత్రమే ప్రధానం. నా భార్య(Wife Vs Sundays) ఎంతో మంచిది. ఆమెను చూస్తూ ఉండటం నాకెంతో ఇష్టం’’ అని పేర్కొంటూ ఇటీవలే ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ చేశారు. దీనిపై ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ సుబ్రమణ్యన్ స్పందిస్తూ.. ‘‘ఇంట్లో కూర్చొని ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు? ఇంట్లో తక్కువ, ఆఫీసులో ఎక్కువగా ఉంటామని భార్యలకు చెప్పాలి. అవసరమైతే ఆదివారాలు కూడా పనిచేయాలి’’ అని కామెంట్స్ చేయడం తీవ్ర దుమారానికి దారితీసింది. కార్మిక సంఘాలతో పాటు వ్యాపారవేత్తల నుంచి కూడా విమర్శలు వచ్చాయి.  అయినా ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ సుబ్రమణ్యన్ అస్సలు వెనక్కి తగ్గలేదు. ‘‘నేను చేసిన కామెంట్స్ చాలా పెద్ద ఆశయాన్ని ప్రతిబింబిస్తాయి. అసాధారణ ఫలితాలకు అసాధారణ కృషి అవసరం కదా ?’’ అని ఎదురు ప్రశ్నను సంధించారు.

Also Read :Worlds Smartest Pen : న్యూవా పెన్.. పెన్నులో కూడా ఇన్ని ఫీచర్లా ?!