Site icon HashtagU Telugu

Aadhaar Updation: ఆధార్ కార్డు అప్డేట్ గ‌డువు పెంపు.. డిసెంబ‌ర్ 14 వ‌ర‌కు అవ‌కాశం..!

Aadhaar Updation

Aadhaar Updation

Aadhaar Updation: ఆధార్ కార్డును (Aadhaar Updation) పదేళ్లుగా అప్డేట్ చేసుకోని వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఈనెల 14న ముగియనుండటంతో గడువును పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చింది. తాజా నిర్ణయంతో డిసెంబర్ 14వ తేదీ వరకూ ఉచితంగా ఆధార్‌ అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. గడువు పూర్తయ్యాక రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఆధార్ అప్డేట్ చేసుకోకపోయినా అది పని చేస్తుందని UIDAI తెలిపింది.

ఆధార్ కార్డు అనేది భారతదేశ ప్రజల గుర్తింపు. బ్యాంక్ ఖాతా తెరవడం నుండి పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్‌తో సహా అన్ని ప్రభుత్వ సేవలను పొందడం వరకు ఆధార్ కార్డు చాలా ముఖ్య‌మైనది. ఈ పరిస్థితిలో ఆధార్ కార్డ్ హోల్డర్లు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తమ ఆధార్‌ను పునరుద్ధరించుకోవాలని ఆధార్ అథారిటీ సలహా ఇస్తుంది.

Also Read: Kandahar Hijack : బీజేపీ ఉగ్రవాదులను వదిలేయబట్టే.. దేశం ఉగ్రదాడులను ఎదుర్కొంది : ఫరూక్ అబ్దుల్లా

ఎల్లుండి (సెప్టెంబర్ 14) వరకు ఆధార్ కార్డులను ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చని తొలుత ఆధార్ సంబంధిత శాఖ స‌ర్క్యూల‌ర్ జారీచేసింది. అధికారిక ఇ-సేవా కేంద్రం, తాలూకా కార్యాలయాలలో అప్‌డేట్‌లను ఉచితంగా చేయవచ్చు. సెప్టెంబర్ 14 తర్వాత డ‌బ్బు చెల్లించాల్సి ఉంటుందని తొలుత స‌ర్క్యూల‌ర్ లో తెలిపింది. సెప్టెంబర్ 14 వరకు ఉచిత అప్‌డేట్ గ‌డువు ఇప్పుడు డిసెంబర్ 14 వరకు పొడిగించారు. దీంతో ఆధార్ కార్డు అప్డేట్ చేయాల‌నుకునేవారు ఇప్పుడు డిసెంబర్ 14 వరకు ఉచితంగా మార్పులను చేయవచ్చు.

ఆధార్‌లో ఇంటి చిరునామాను ఉచితంగా అప్‌డేట్ చేయడం ఎలా?

మీరు ఆధార్ కార్డులో ఇంటి చిరునామాను మార్చాలనుకుంటున్నారా లేదా దానిలో ఏదైనా తప్పును సరిదిద్దాలనుకుంటున్నారా? అయితే దీని కోసం ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ప్రాసెస్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆన్‌లైన్ ప్రక్రియను అనుసరించడం ద్వారా మీరు ఆధార్ కార్డ్‌లోని చిరునామాను ఉచితంగా మార్చుకోవచ్చు. దశల వారీ ప్రక్రియను తెలుసుకుందాం.