ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

UIDAI ఇప్పుడు పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసే సదుపాయాన్ని కల్పించింది. పేరు, చిరునామా మార్పు కోసం ఫీజును రూ. 50 నుండి రూ. 75కి పెంచారు.

Published By: HashtagU Telugu Desk
Aadhaar Updates

Aadhaar Updates

Aadhaar Updates: బ్యాంకు ఖాతాల నుండి ప్రభుత్వ పథకాల ప్రయోజనాల వరకు ప్రతిదానికీ ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆధార్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు UIDAI PVC ఆధార్ కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది పాత ఆధార్ కార్డ్ కంటే బలంగా ఉండటమే కాకుండా ఎక్కువ కాలం మన్మడమే కాక మరిన్ని భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. దీనితో పాటు ఆధార్ అప్‌డేట్, PVC కార్డ్ సేవల కోసం UIDAI ఫీజులను సవరించింది.

ఆన్‌లైన్ సవరణలు, ఫీజుల్లో మార్పులు

UIDAI ఇప్పుడు పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసే సదుపాయాన్ని కల్పించింది. పేరు, చిరునామా మార్పు కోసం ఫీజును రూ. 50 నుండి రూ. 75కి పెంచారు. ఆన్‌లైన్ అప్‌డేట్‌లు 14 జూన్ 2026 వరకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఆధార్ సేవా కేంద్రాలలో ఫోటో అప్‌డేట్ కోసం రూ. 125, ఆధార్ రీప్రింట్ కోసం రూ. 40 ఛార్జ్ చేస్తారు. కొత్త సిస్టమ్ ద్వారా సమాచారం నేరుగా UIDAI డేటాబేస్ నుండి వెరిఫై చేయబడుతుంది. దీనివల్ల ప్రజలు ప్రతిదానికీ ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

PVC ఆధార్ కార్డ్ ప్రత్యేకతలు

PVC (పాలివినైల్ క్లోరైడ్) తో తయారైన ఈ కార్డ్ మీ ATM కార్డ్ మాదిరిగానే ఉంటుంది. ఇది జేబులో లేదా వాలెట్‌లో సులభంగా పడుతుంది.

QR కోడ్- హోలోగ్రామ్

మైక్రో టెక్స్ట్, గిలోచ్ పాటర్న్ ఇది మన్నికైనది మాత్రమే కాకుండా మోసాల నుండి కూడా రక్షణ కల్పిస్తుంది.

Also Read: కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

PVC ఆధార్ కార్డ్ ఎలా పొందాలి?

మీరు ఆన్‌లైన్ ద్వారా సులభంగా PVC ఆధార్ కార్డ్‌ను ఆర్డర్ చేయవచ్చు.

వెబ్‌సైట్: UIDAI అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in సందర్శించండి.

ఆర్డర్: ‘Get Aadhaar’ సెక్షన్‌లో ‘Order Aadhaar PVC Card’ పై క్లిక్ చేయండి.

వివరాలు: మీ 12 అంకెల ఆధార్ నంబర్ లేదా VID నమోదు చేసి, క్యాప్చా పూరించండి.

OTP: మీ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా వెరిఫై చేయండి.

చెల్లింపు: రూ. 50 (GST, స్పీడ్ పోస్ట్ ఖర్చులతో కలిపి) ఆన్‌లైన్‌లో (UPI, క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్) చెల్లించండి. చెల్లింపు పూర్తయిన తర్వాత మీ PVC ఆధార్ కార్డ్ స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటి చిరునామాకు డెలివరీ చేయబడుతుంది.

  Last Updated: 06 Jan 2026, 07:01 PM IST