Site icon HashtagU Telugu

Highest Paying Jobs: అత్య‌ధిక జీతాలు పొందే 5 ప్రైవేట్ ఉద్యోగాలు ఇవే..!

Highest Paying Jobs

Highest Paying Jobs

Highest Paying Jobs: భారతదేశంలో ప్రైవేట్ రంగంలో లక్షలాది మంది పనిచేస్తున్నారు. రాబోయే కాలంలో ఈ రంగంలోని వ్యక్తుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువత కూడా ఈ రంగంలో వేగంగా ఎదుగుతోంది. అయితే అత్యధిక జీతాలు (Highest Paying Jobs) ఇచ్చే ఉద్యోగాలు ఏవి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మంచి జీతం పొందే అనేక ఉద్యోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలాంటి పరిస్థితిలో మీరు మంచి జీతం పొందగల ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మేము మీ కోసం కొన్ని ఉద్యోగాల‌ను తీసుకువ‌చ్చాం. ఇవి మీ భవిష్యత్తు కోసం స‌హాయ‌ప‌డే అవ‌కాశ ఉంది. ఈ జాబితాలో IT డైరెక్టర్, డేటా సైంటిస్ట్, కమర్షియల్ పైలట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఈ వృత్తిలో ఉన్న‌వారి జీతం, ఇతర వివరాలను తెలుసుకుందాం.

డేటా సైంటిస్ట్

డేటా సైంటిస్ట్‌లు ఉన్నత స్థాయి ఉద్యోగం. దీని కోసం మీరు ప్రత్యేక అధ్యయనాలు చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగంలో మీరు రూ. 3.9 లక్షల నుండి రూ. 28 లక్షల వరకు జీతం ప్యాకేజీని పొందవచ్చు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎమ్, యాక్సెంచర్, అమెజాన్ వంటి అనేక పెద్ద కంపెనీలు ఈ ఉద్యోగం కోసం వ్యక్తులను రిక్రూట్ చేస్తాయి.

ఐటీ డైరెక్టర్

మీరు ఐటి రంగంలో పని చేయాలనుకుంటే ఐటి డైరెక్టర్ మంచి ఎంపిక. ఇందులో మీరు మంచి జీతం పొందుతారు. ఇది రూ. 14 లక్షల నుండి రూ. 99 లక్షల వరకు ఉంటుంది. దీని కోసం మీరు కంప్యూటర్ సైన్స్, ఐటీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు ఈ ఉద్యోగం కోసం నియమించుకుంటాయి.

Also Read: Inter Student Dead: ఏపీలో విషాదం.. పెట్రోల్ దాడికి గురైన ఇంట‌ర్ విద్యార్థిని మృతి

ప్రొడక్ట్ మేనేజర్

ప్రొడక్ట్ మేనేజర్ ఉద్యోగం అత్యధిక జీతం ఇచ్చే ఉద్యోగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇందులో మీరు ఉత్పత్తి తయారీ, ప్రారంభించడం, నిర్వహణ, మార్కెటింగ్, డిజైన్, అమ్మకాలు, వ్యూహం వంటి పనిని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం కోసం మీరు మార్కెటింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. జీతం గురించి చెప్పాలంటే ఇందులో రూ. 5.5 లక్షల నుండి రూ. 38 లక్షల వరకు వార్షిక వేతనం పొందవచ్చు.

కమర్షియల్ పైలట్

ఇది భారతదేశంలో అత్యధికంగా చెల్లించే ఉద్యోగాలలో ఒకటి కమర్షియల్ పైలట్ ఉద్యోగం. ఇందులో రూ. 1.1 లక్షల నుండి రూ. 84 లక్షల వరకు జీతం ప్యాకేజీని పొందవచ్చు. కమర్షియల్ పైలట్ కావాలంటే మంచి శిక్షణ తీసుకోవాలి. కమర్షియల్ పైలట్ ఉద్యోగంలో ప్రీ-ఫ్లైట్ ఇన్‌స్పెక్షన్, ఫ్లైట్ ప్లానింగ్, నావిగేషన్, కమ్యూనికేషన్, ల్యాండింగ్ వంటి పనులు ఉంటాయి.

ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు

ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు విలాసవంతంగా ఉంటారు. కాబట్టి ఈ ఉద్యోగానికి అధిక జీతం ప్యాకేజీ ఉండటం సర్వసాధారణం. మీరు ఈ రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంటే మీరు బ్యాంకింగ్‌కు సంబంధించిన అధ్యయనం చేయాలి. ఈ ఉద్యోగానికి ప్రారంభ వేతనం రూ. 2 లక్షలు కావచ్చు. కానీ అనుభ‌వం వ‌చ్చే కొద్దీ సంవత్సరానికి రూ. 60 లక్షల ప్యాకేజీపై కూడా పని చేయవచ్చు.