Site icon HashtagU Telugu

IPC : హైదరాబాద్‌లో 3 రోజుల పాటు 30వ ఇండియన్ ప్లంబింగ్ కాన్ఫరెన్స్‌..

30th Indian Plumbing Conference in Hyderabad for 3 days..

30th Indian Plumbing Conference in Hyderabad for 3 days..

Indian Plumbing Conference : అత్యంత ప్రతిష్టాత్మకమైన 30వ ఇండియన్ ప్లంబింగ్ కాన్ఫరెన్స్ (ఐపీసీ) నవంబర్ 21-23, 2024 తేదీలలో హైదరాబాద్‌ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగనుంది. ఈ మెగా సమ్మేళనంలో అంతర్జాతీయంగా 1,500 మంది డెలిగేట్‌ లు , 80+ ఎగ్జిబిటర్‌లు హాజరుకానున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద ప్లంబింగ్ పరిశ్రమ కలయికగా మారనుంది. భారతదేశపు ప్లంబింగ్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ, తొమ్మిదేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లో ఈ వేడుక జరుగనుంది. ఈ మెగా కాన్ఫరెన్స్ 1,500 కు పైగా అంతర్జాతీయ డెలిగేట్‌లు హాజరుకానున్నారు.

మరోవైపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ మరియు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు హాజరుకానున్నారు. దాన కిషోర్, IAS, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ, గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. అంతర్జాతీయ దృక్పథాన్ని జోడిస్తూ, భారతదేశంలోని డెన్మార్క్ రాయబార కార్యాలయం నుండి కమర్షియల్ కౌన్సెలర్ అయిన శ్రీ సోరెన్ నార్రెలుండ్ కన్నిక్-మార్క్వార్డ్‌సెన్ కీలక ప్రసంగం చేస్తారు. కాగా, ప్రాంతీయ నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంలో భాగంగా ఈ సదస్సు “ఎ గైడ్ టు గుడ్ ప్లంబింగ్ ప్రాక్టీసెస్” యొక్క మొట్టమొదటి తెలుగు ఎడిషన్‌ను ప్రారంభించనుంది. రిజిస్ట్రేషన్ మరియు మరింత సమాచారం కోసం, https://indianplumbing.org/ని సందర్శించండి.

“నీరు కేవలం ఒక వనరు కాదు.. ఇది మన సమాజాలు , ఆర్థిక వ్యవస్థలకు జీవనాధారం. 2030 నాటికి, భారతదేశ నీటి డిమాండ్, సరఫరాను మించిపోతుందని అంచనా వేయబడింది. మన నగరాలు ‘డే జీరో’ ను చేరుకోకుండా నిరోధించడానికి మనం ఇప్పుడు చర్య తీసుకోవాలి” అని ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ (ఐపిఏ) జాతీయ అధ్యక్షుడు గుర్మిత్ సింగ్ అరోరా హెచ్చరిస్తున్నారు. సదస్సులలో భాగముగా వాటర్ అండ్ హెరిటేజ్ కన్జర్వేషన్, హై-రైజ్ బిల్డింగ్ వాటర్ మేనేజ్‌మెంట్ మరియు హాస్పిటాలిటీలో నీటి పొదుపు వంటి కీలకమైన అంశాలపై సంచలనాత్మక చర్చలు జరుగనున్నాయి హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ నుండి డాక్టర్ రమా కాంత్, వాష్ ఇన్నోవేషన్ హబ్‌కి చెందిన ప్రొ. శ్రీనివాస్ చారీ మరియు జెఎల్ఎల్ ఆసియా పసిఫిక్ మరియు ఐటిసి నుండి పరిశ్రమల ప్రముఖులతో సహా ప్రముఖ వక్తలు తమ నైపుణ్యం మరియు పరిజ్ఞానం పంచుకుంటారు.

Read Also: Rishabh Pant: రిషబ్ పంత్‌ని వద్దంటున్న ప్ర‌ముఖ‌ ఫ్రాంచైజీ!