Site icon HashtagU Telugu

Xiaomi electric car : మార్కెట్ లోకి మరో షావోమీ ఎలక్ట్రిక్ కార్ విడుదల.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

Another Xiaomi Electric Car Is Released In The Market.. Features Are Not Usual..

Another Xiaomi Electric Car Is Released In The Market.. Features Are Not Usual..

Xiaomi Electric Car : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ టెక్ మార్కెట్ లో ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. మార్కెట్లో కూడా షావోమీ (Xiaomi) బ్రాండ్స్ కు బాగానే డిమాండ్ ఉంది అని చెప్పవచ్చు. కాగా మొదట్లో కేవలం బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను మాత్రమే మార్కెట్లోకి తీసుకువచ్చిన షావోమీ ఆ తర్వాత ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా షావోమి టెక్‌ మార్కెట్లో ఎన్నో రకాల గ్యాడ్జెట్స్‌ను తీసుకొచ్చాయి. రోబో వ్యాక్యూమ్‌ క్లీనర్‌ మొదలు స్మార్ట్ వాచ్‌లు, ఇయర్‌ బడ్స్‌తో పాటు ఇలా ఎన్నో అధునాతన ఫీచర్లతో కూడిన ప్రొడక్ట్స్‌ను లాంచ్‌ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏకంగా కార్లను తీసుకొచ్చే పనిలో పడింది షావోమీ. షావోమీ (Xiaomi) కంపెనీ నుంచి తొలి ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు.

We’re Now on WhatsApp. Click to Join.

షావోమి ఎస్‌యూ7 పేరుతో ఈ కారును లాంచ్‌ చేయనున్నారు. కాగా ఇప్పటికే షావోమీ (Xiaomi) ఈ కార్లకు సంబంధించి లైసెన్స్‌ కోసం చైనాలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే షావోమీ ఈ కార్లను స్వయంగా రూపొందించడం లేదు..బీజింగ్‌ ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ హోల్డింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ సహకారంతో ఈ కార్లను తయారు చేస్తోంది. దీనికోసం సదరు కంపెనీకి కాంట్రాక్టుకు ఇచ్చింది. ఇక చైనా ఇండస్ట్రీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం కంపెనీ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా షావోమీ (Xiaomi) ఎలక్ట్రిక్‌ కారుకు సంబంధించి కొన్ని వివరాలను విడుదల చేసింది. మరి ఆ కారుకు సంబంధించిన వివరాల్లోకి.. ఇందులో వీల్‌బేస్‌ 3000 ఎంఎంగా ఇవ్వనున్నారు. లైడర్‌ సెన్సర్‌ వంటి అధునాతన ఫీచర్‌ లను అందించనున్నారు.

ఈ కారులో ఫేస్‌ రికగ్నిషన్‌ అన్‌లాకింగ్‌ ఫీచర్‌ను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అనగా మన స్మార్ట్‌ ఫోన్‌ కు ఎలా అయితే ఫేస్ లాక్ ఉంటుందో అదేవిధంగా ఈ కార్ కి కూడా కీ లేకుండా అన్‌లాక్‌ చేసకోవచ్చు. ఇక ఈ కారులో రెండు రకాల బ్యాటరీలను అందించారు. వీటిలో ఒకి 220 కిలోవాట్‌ మోటార్‌తో కూడిన రియర్‌ వీల్‌ డ్రైవ్ కాగా మరొకటి 495 కిలోవాట్‌ మ్యాగ్జిమమ్‌ పవర్‌తో కూడిన ల్‌ వీల్‌ డ్రైవ్‌ ను ఇవ్వనున్నారు. కాగా ఈ కారును మొత్తం మూడు వేరియంట్స్‌లో తీసుకున్నారు. షావోమి ఎస్‌యూ7, ఎస్‌యూ7 ప్రో, ఎస్‌యూ7 మ్యాక్స్‌ వేరియంట్స్‌లో ఈ కారు అందుబాటులోకి రానుంది. హైపర్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ అనే ఓఎస్‌ను తీసుకురానున్నారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కార్లతో పాటు ఫోన్‌లలోనూ ఉపయోగించుకోవచ్చు. 2023 డిసెంబర్‌లో ఈ కారును లాంచ్‌ చేసి, 2024 ఫిబ్రవరి నుంచి సేల్స్‌ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆటోమొబైల్‌ సంస్థలో షావోమీ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. అలాగే ఈ కారుకు సంబంధించిన ధరల వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read:  Bigg Boss VJ Sunny : పేరుకే 50 లక్షలు.. చేతికి వచ్చేది సగమే.. బిగ్ బాస్ ప్రైజ్ మనీ పై సన్నీ హాట్ కామెంట్స్..!