Indian Auto Companies : భారత్ నుంచి వాహన దిగుమతులపై 25 శాతం సుంకాన్ని విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనివల్ల భారత్‌లోని వాహన కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడబోతోంది. ఇంతకీ ఏయే కంపెనీలు ప్రభావితం కాబోతున్నాయి ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Pray Only To Allah: మమ్ముట్టి కోసం మోహన్ లాల్ పూజలకు వక్రభాష్యం.. సంచలన డిమాండ్
వాహన విడిభాగాల కంపెనీలపై ప్రభావం ఇలా..
- అమెరికా విధించనున్న 25 శాతం దిగుమతి సుంకం వల్ల టాటా మోటార్స్, ఐచర్ మోటార్స్, సోనా బీఎల్‌డబ్ల్యూ, సంవర్ధన మదర్సన్ వంటి భారతీయ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ కంపెనీలు అమెరికా, యూరప్, జపాన్, దక్షిణ కొరియా, చైనాలకు వాహన విడిభాగాలను ఎగుమతి చేస్తుంటాయి.
- వాహన విడిభాగాల తయారీ కంపెనీ ‘సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్’కు అతిపెద్ద మార్కెట్లు యూరప్, అమెరికా. ఈ కంపెనీ టెస్లా, ఫోర్డ్ వంటి ప్రధాన అమెరికన్ ఆటోమేకర్లకు విడిభాగాలను సప్లై చేస్తుంటుంది. ఈ కంపెనీకి అమెరికా, యూరప్‌లలోనూ తయారీ ప్లాంట్లు ఉన్నాయి. దీంతో 25 శాతం దిగుమతి సుంకం నుంచి తప్పించుకున్నట్టే.
- సోనా కామ్‌స్టార్ కంపెనీ వాహనాలకు సంబంధించిన డిఫరెన్షియల్ గేర్లు, స్టార్టర్ మోటార్లు తయారు చేస్తుంది. ఈ కంపెనీ ఆదాయంలో దాదాపు 66 శాతం అమెరికా, ఐరోపా మార్కెట్ల నుంచి వస్తుంటుంది. మిగతా 34 శాతం ఆదాయం చైనా, జపాన్, దక్షిణ కొరియాల నుంచి లభిస్తుంటుంది. రాబోయే ఐదేళ్లలో తమ ఆదాయంలో 50 శాతాన్ని ఈ మార్కెట్ల నుంచి పొందాలని సోనా కామ్‌స్టార్ భావిస్తోంది.
- వాహన విడిభాగాల తయారీ కంపెనీలలో భారత్ ఫోర్జ్, సన్సేరా ఇంజనీరింగ్ లిమిటెడ్, సుప్రజిత్ ఇంజనీరింగ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఉన్నాయి.
- 2024 ఆర్థిక సంవత్సరంలో మన భారత దేశం నుంచి 21.2 బిలియన్ డాలర్లు విలువైన వాహన విడిభాగాల ఎగుమతి జరిగింది. ఈవిషయంలో భారత్‌కు ప్రధాన మార్కెట్లుగా అమెరికా, యూరప్ ఉన్నాయి. భారత్ చేస్తున్న మొత్తం ప్రపంచ వాణిజ్యంలో వాహన విడిభాగాల వాటా దాదాపు 4.5 శాతం ఉంటుంది.
టాటా మోటార్స్‌పై పరోక్ష ఎఫెక్ట్
టాటా మోటార్స్(Indian Auto Companies) అమెరికాకు ప్రత్యక్ష ఎగుమతులు చేయడం లేదు. అయితే దాని అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR)కు అమెరికన్ మార్కెట్లో బలమైన పట్టు ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 లక్షల వాహనాలను విక్రయించింది. ఈ కంపెనీ సాధించిన మొత్తం వాహన అమ్మకాల్లో 22 శాతం వాటా అమెరికా నుంచే సమకూరింది. ఈ లెక్కన అమెరికా అనేది జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు పెద్ద మార్కెట్. అమెరికాలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ విక్రయించే వాహనాలను ప్రధానంగా బ్రిటన్, ఇతర ఐరోపా దేశాల్లోని ప్లాంట్లలో తయారు చేస్తారు. అక్కడి నుంచి వాహనాలు అమెరికాకు దిగుమతి అవుతాయి. దీంతో ఆ వాహనాలపై 25 శాతం దిగుమతి సుంకం పడుతుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ – ఐచర్ మోటార్స్
రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను ఐచర్ మోటార్స్ తయారు చేస్తుంది. ఈ కంపెనీకి చెందిన 650సీసీ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్ మోడళ్లకు ప్రధాన మార్కెట్ అమెరికా.
Also Read :Ram Navami 2025: శ్రీరామ నవమి రోజున అయోధ్యలో కార్యక్రమాలివీ..