EV Vehicle Subsidy: ఉత్తరప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై రూ. 1 లక్ష వరకు సబ్సిడీ (EV Vehicle Subsidy) అందుబాటులో ఉంది. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలుపై రూ. 5000 సబ్సిడీ ఇవ్వబడుతోంది. తాజాగా యూపీ ప్రభుత్వం దీని కోసం పోర్టల్‌ను ప్రారంభించింది. గత జూలైలో ప్రభుత్వం ఈ సబ్సిడీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు అమలులోకి వచ్చింది.
ప్రైవేట్ ఈ-బస్సుపై రూ.20 లక్షల వరకు సబ్సిడీ
సమాచారం ప్రకారం.. యూపీ ప్రభుత్వం వివిధ ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని అందిస్తోంది. ప్రైవేట్ ఈ-బస్సులపై గరిష్టంగా రూ.20 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. దీంతోపాటు నాలుగు చక్రాల వాహనంపై రూ.లక్ష, ద్విచక్రవాహనంపై రూ.5 వేలు, ఈ-గూడ్స్ క్యారియర్‌పై రూ.లక్ష వరకు సబ్సిడీ ఇస్తున్నారు. UP ప్రభుత్వ డేటా ప్రకారం.. ఏప్రిల్ 1 నుండి జూలై 31, 2024 వరకు రాష్ట్రంలో మొత్తం 7748 EV వాహనాలు విక్రయించబడ్డాయి. ఇంతకు ముందు ఏప్రిల్ 1, 2023 నుండి మార్చి 31, 2024 వరకు ఈ సంఖ్య 82093.
Also Read: Pawan Kalyan : విపత్తు సమయంలో చిల్లర రాజకీయాలు : పవన్ కల్యాణ్
సబ్సిడీ కోసం ఎక్కడ దరఖాస్తు చేయాలి..?
ఉత్తరప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనంపై సబ్సిడీని పొందేందుకు మీరు ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు సబ్సిడీ పోర్టల్ upevsubsidy.inలో దరఖాస్తు చేసుకోవాలి. సమాచారం ప్రకారం.. మీరు EV వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు సబ్సిడీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం వాహనం ఎవరి పేరుతో కొనుగోలు చేశారో వారి ఆధార్ కార్డు, ఫొటో, బ్యాంకు వివరాలను అందించాల్సి ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
డీలర్లు దరఖాస్తు చేసుకోవాలి..!
దీని కోసం దరఖాస్తు చేయడంలో తమ కస్టమర్లకు సహాయం చేయాలని ప్రభుత్వం అన్ని డీలర్లు, షోరూమ్ యజమానులను ఆదేశించింది. ఎవరైనా కారు కొన్నప్పుడు ఈ ప్రభుత్వ విధానం గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కారు కొనుగోలుదారు కారు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫార్మాలిటీలను పూర్తి చేయడం, సబ్సిడీ కోసం దరఖాస్తు చేయడంలో సహాయపడటం డీలర్ల బాధ్యత అని తెలిపింది.