232 Crore – A Car : అదానీ, అంబానీ కూడా కొనలేని లగ్జరీ కారు.. విశేషాలివీ

232 Crore - A Car : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును చూశారా ? దాని ధర ఎంతో తెలుసా? 

  • Written By:
  • Updated On - February 18, 2024 / 02:24 PM IST

232 Crore – A Car : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును చూశారా ? దాని ధర ఎంతో తెలుసా?  ‘రోల్స్ రాయిస్​ బోట్ టెయిల్’ కారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. అక్షరాలా రూ.232 కోట్లు పెడితే మనం ఈ కారును కొనుక్కోవచ్చు. ఇప్పటి వరకు ఈ కారును ప్రపంచంలో ముగ్గురే కొన్నారు. దీని విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

రోల్స్ రాయిస్​ కంపెనీ ఈ కారుకు ‘బోట్​ టెయిల్’​ అని పేరు పెట్టడానికి ఓ కారణం ఉంది. వాస్తవానికి ఈ కారు డిజైన్​ దాదాపు రేసింగ్ బోట్‌​లా ఉంటుంది. కారు వెనుక ఉన్న డెక్‌ను  పిక్నిక్ టేబుల్​లా మార్చుకునే  వీలుంటుంది.  అందుకే దీనికి ‘బోట్​ టెయిల్’​ అని పేరు పెట్టారు. రోల్స్ రాయిస్​ బోట్​ టెయిల్ కారును కార్బన్ ఫైబర్​ కవర్​తో రూపొందించారు. ఇది కన్వర్టబుల్​​ ఓపెన్​ టాప్​ రూఫ్​తో వస్తుంది. ఈ ​ కారులో నాలుగు లగ్జరీ సీట్స్ ఉంటాయి. కారు వెనుక భాగంలో ఉన్న డెక్​లో కాక్టెయిల్​ స్టోర్ ఉంటుంది. ఇందులో మనకు నచ్చిన డ్రింక్స్ ఉంచుకోవచ్చు. దీనిలో కన్వర్టబుల్​ టేబుల్స్​, చైర్స్ కూడా ఉంటాయి. పిక్నిక్​లకు, విహార యాత్రలకు వెళ్లినప్పుడు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ కారులోని(232 Crore – A Car) బూట్​ డోర్స్​ను ఓపెన్ చేస్తే, సీతాకోకచిలుక రెక్కలలా విచ్చుకుంటాయి.

Also Read :Driving Tips : కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారా ? ఇవీ టిప్స్

రోల్స్​ రాయిస్​ బోట్ టెయిల్ కారు​లో వీ12 6.75 లీటర్​ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 563 bhp పవర్ జనరేట్ చేస్తుంది. ఈ కారు పూర్తిగా హ్యాండ్​మేడ్ కావడం గమనార్హం. దీనిని పూర్తి చేయడానికి ఏకంగా నాలుగేళ్లు పట్టిందని కంపెనీ వెల్లడించింది. రోల్స్ రాయిస్​ కంపెనీ 2017లో స్వెప్టైల్ కారును లాంఛ్ చేసింది. దాన్ని ప్రేరణగా తీసుకొని రోల్స్​ రాయిస్​ బోట్ టెయిల్ కారు​ను రూపొందించింది. ఇప్పటి వరకు ముగ్గురు మాత్రమే ఈ సూపర్ లగ్జరీ కారును కొన్నారు. డైలీ మెయిల్ ప్రకారం, ప్రముఖ మ్యూజిక్​ కపుల్​ జే-జెడ్​, బియాన్స్ వద్ద ఒక రోల్స్ రాయిల్ బోట్ టెయిల్ కారు ఉంది. అర్జెంటీనా ఫుట్​బాల్ ప్లేయర్​ మౌరీ ఇకార్డి దగ్గర మరొకటి ఉంది. మూడోది మరొక గుర్తుతెలియని బిలియనీర్ జంట వద్ద ఉంది.

Also Read : Floating Bridge : వైజాగ్‌ బీచ్‌లో ‘ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌’.. ప్రత్యేకతలు ఇవిగో