Tata Nexon Crash Test Rating: బలమైన భద్రత కారణంగా టాటా మోటార్స్ ఎస్‌యూవీలు భారత మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవల వెల్లడైన క్రాష్ టెస్ట్ ఫలితాలు (Tata Nexon Crash Test Rating) కొత్త టాటా నెక్సాన్ భారతదేశంలోని NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను సాధించినట్లు చూపుతున్నాయి. గ్లోబల్ NCAP, ఇండియా NCAP క్రాష్ టెస్ట్‌లలో 5 స్టార్ రేటింగ్ సాధించిన కార్లలో ఈ SUV ఒకటి. టాటా నెక్సాన్ ఇండియా NCAP క్రాష్ టెస్ట్ ఫలితాలను వివరంగా పరిశీలిద్దాం.
టాటా నెక్సాన్ ఇండియా NCAP ఫలితాలు
టాటా నెక్సాన్ కంపెనీ బెస్ట్ సెల్లర్ SUV. దీని ఇండియా NCAP క్రాష్ టెస్ట్ వెల్లడైంది. ఈ సబ్ 4-మీటర్ SUV పెద్దల భద్రత, పిల్లల భద్రతలో 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. టెస్టింగ్ మోడల్ నెక్సాన్ ఫియర్‌లెస్ డీజిల్ AMT. దీని బరువు 1,638 కిలోలు. ఈ కారు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్‌తో పాటు స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది.
అడల్ట్ సేఫ్టీలో నెక్సన్ 29.41/32 పాయింట్లను స్కోర్ చేసింది. కారు ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 14.65/16 పాయింట్లు, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 14.76/16 పాయింట్లతో ఉత్తీర్ణత సాధించింది. టాటా నెక్సన్ పిల్లల భద్రతలో 43.83/49 పాయింట్ల గౌరవప్రదమైన స్కోర్‌ను సాధించింది. అదే సమయంలో టాటా నెక్సన్‌కు భారతదేశం NCAP సంయుక్తంగా 5 స్టార్.. పెద్దలు, పిల్లల భద్రతలో అందించింది.
Also Read: Heavy Rains In AP: ఏపీలోని ఐదు జిల్లాలకు వరద ముప్పు.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ స్క్రీన్
టాటా నెక్సాన్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో పాటు కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్‌లతో ఫ్రీ-స్టాండింగ్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. ఇందులో కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ స్క్రీన్ అందుబాటులో ఉంది.
ఇంజిన్ పవర్‌ట్రెయిన్
టాటా నెక్సాన్ ఇంజన్ పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడుకుంటే.. ఇది 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది సుమారు 120PS గరిష్ట శక్తిని, 170Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వేరియంట్ గురించి చెప్పాలంటే.. ఇది 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 110hp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేయగలదు. దీని ట్రాన్స్‌మిషన్ గురించి మాట్లాడుకుంటే.. ఇది 5-స్పీడ్ MT, 6-స్పీడ్ MT, AMT ఎంపికలను కలిగి ఉంది.