Site icon HashtagU Telugu

Summer Car Tips: వేసవిలో కార్ లోపల చల్లగా మార్చుకోండిలా!

Summer Car Tips

New Web Story Copy 2023 05 27t152305.065

Summer Car Tips: వేసవి వచ్చిందంటే చాలు బయటకెళ్లేందుకు వణికిపోతుంటారు. 40 డిగ్రీల వేడికి ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోతున్న పరిస్థితి. అయితే కొందరు మాత్రం వేసవిని వెకేషన్ గా మార్చుకుని తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇదిలా ఉండగా.. వేసవి తాపం నుంచి మనుషులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉపశమనం పొందుతారు. మరి కార్ల పరిస్థితి ఏంటి? మీరు ఎలా అయితే వేసవిని ఎదుర్కొనేందుకు సంసిద్ధం అవుతారో.. అలాగే మీ కారుని కూడా పట్టించుకోవాలిగా.

రోజురోజుకూ పెరుగుతున్న వేడిమి కారణంగా ప్రజలు ప్రయాణాలు చేసేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సొంత కారు ఉన్న వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా వేసవి సీజన్ లో కార్ల యజమానులు చాలా సందర్భాల్లో తమ కార్లను ఆరుబయట పార్క్ చేయాల్సి ఉంటుంది. ఎండలో కారును ఎక్కువసేపు పార్క్ చేయటం ద్వారా కారు లోపలి వాతావరణం చాలా తక్కువ సమయంలోనే అత్యంత వేడిగా మారిపోతుంది. అయితే ఈ సమస్యను నివారించడానికి కొన్ని మార్గాలను పాటిస్తే సరిపోతుంది.

కారు లోపల చల్లని వాతావరణం కోసం విండో ఫ్యాన్‌లు ఉపయోగపడతాయి. మార్కెట్‌లో సోలార్ ప్యానెల్స్‌తో కూడిన విండో ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. ఎండాకాలంలో ఈ ఫ్యాన్లు అద్భుతంగా పనిచేస్తాయి. మీరు కారును ఎండలో లేదా ఏదైనా బహిరంగ ప్రదేశంలో పార్క్ చేసినప్పుడు, ఈ ఫ్యాన్ సోలార్ ప్యానెల్ సహాయంతో ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది మరియు కారు లోపలి భాగాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. 2 వేల నుంచి 8 వేల రూపాయల వరకు ధర చెల్లించి కొనుగోలు చేయవచ్చు.

వేసవి కాలంలో మీరు నేరుగా సూర్యకాంతి లోపలికి రాకుండా నిరోధించడానికి కారులో కర్టెన్లను ఉపయోగించవచ్చు. మార్కెట్లో అనేక రకాల విండో కర్టెన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ బడ్జెట్ మరియు కారు మోడల్ ప్రకారం వాటిని ఎంచుకోవచ్చు. కారును పార్కింగ్ చేసిన తర్వాత కర్టెన్లను ఉపయోగించడం ద్వారా కారు లోపలి భాగం వేడెక్కకుండా కాస్త ఉపశమనం కలిగిస్తుంది.

అయితే కొందరు కారు లోపలి భాగాలు కనిపించకుండా పూర్తిగా దాచడం, లేదా అద్దాలపై బ్లాక్ ఫిల్మ్‌ను ఏర్పాటు చేస్తుంటారు. నిజానికి అది చట్టరీత్య నేరం. పట్టుబడితే పెనాల్టీ తప్పదు. సో సామాన్యులు కారులో ఏసీ అవసరం లేదు అనుకుంటే చిన్న చిన్న మార్గాలను అవలంబిస్తే సరిపోతుంది.

Read More: Viveka Murder : జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లిన వేళ..అవినాష్ రెడ్డికి ఊర‌ట‌