Royal Enfield Scram 440: రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త శక్తివంతమైన బైక్ స్క్రామ్ 440ని (Royal Enfield Scram 440) భారతదేశంలో విడుదల చేసింది. ఇప్పుడు ఇది మునుపటి కంటే పెద్ద ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. కొత్త డిజైన్‌తో పాటు అధునాతన ఫీచర్లు కూడా ఇందులో పొందుపర్చారు. బైక్‌లో కూడా కొన్ని మార్పులు చేశారు. మీరు కూడా ఈ బైక్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ బైక్ ఫీచర్లు, ధర గురించి తెలుసుకోండి.
ధర, వేరియంట్లు
రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 ట్రైల్
- రూ. 2.08 లక్షలు (ఎక్స్-షోరూమ్)
రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 ఫోర్స్
- రూ. 2.15 లక్షలు (ఎక్స్-షోరూమ్)
రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 ట్రైల్, ఫోర్స్ అనే రెండు వేరియంట్లలో పరిచయం చేసింది. దీని ట్రైల్ వేరియంట్‌లో స్పోక్ వీల్స్, ట్యూబ్ టైర్లు అందించారు. ఫోర్స్ వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు ఉపయోగించారు. కస్టమర్లు ఈ బైక్‌ను 5 కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 నేరుగా యెజ్డీ స్క్రాంబ్లర్, ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400ఎక్స్‌తో పోటీపడుతుంది.
కొత్త Scram 440లో కొత్తగా ఏమి ఉంది?
కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440, రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411కి సమానమైన సైజును కలిగి ఉంది. కానీ ఇందులో కొత్త LED హెడ్‌లైట్, పెద్ద ఇంధన ట్యాంక్, కొత్త సీటు, కొత్త టెయిల్ లైట్ వంటి కొన్ని కొత్త ఫీచర్లు ఇవ్వబడ్డాయి. ఈ బైక్‌లు గతంలో కంటే ఇప్పుడు సన్నగా కనిపిస్తున్నాయి.
Also Read: Secret Service Agent : తన ప్రాణాలు కాపాడిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు ట్రంప్ బంపర్ ఆఫర్
ఇంజిన్, పవర్
పనితీరు కోసం బైక్‌లో 443cc ఆయిల్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది 25.4 PS పవర్, 34 Nm టార్క్ ఇస్తుంది. పవర్, టార్క్ మునుపటి కంటే ఎక్కువ. అలాగే ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అయితే మునుపటి మోడల్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.
కొత్త ఫీచర్లు
రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440లో సరికొత్త LED హెడ్‌లైట్, కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, కొత్త సింగిల్ పీస్ సీట్, USB ఛార్జింగ్ పోర్ట్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, రౌండ్ రియర్ వ్యూ మిర్రర్ ఉన్నాయి. శక్తివంతమైన బ్రేకింగ్ సిస్టమ్ మెరుగైన బ్రేకింగ్ కోసం కొత్త స్క్రామ్ 440లో ముందువైపు 300ఎమ్ఎమ్ డిస్క్, వెనుకవైపు 240ఎమ్ఎమ్ డిస్క్ ఉన్నాయి.
ఇందులో డ్యూయల్-ఛానల్ ABS కూడా అందుబాటులో ఉంది. బైక్‌లో 19-అంగుళాల ఫ్రంట్ టైర్, 17-అంగుళాల వెనుక టైర్ ఉన్నాయి. ఇందులో 100 సెక్షన్ ఫ్రంట్, 120 సెక్షన్ రియర్ బ్లాక్ ప్యాటర్న్ టైర్ ఉపయోగించారు. ట్రయల్ వేరియంట్‌లో స్పోక్ వీల్స్, ట్యూబ్ టైర్లు అమర్చారు.