Tesla: ప్రపంచంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎలాన్ మస్క్ తరువాతనే ఎవరైనా. స్పేస్ ఎక్స్ పేరుతో ఓ రాకెట్ ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ మధ్యే ట్విట్టర్ ని కొనుగోలు చేశాడు. ఇక మస్క్ గ్యారేజిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది టెస్లా గురించి. ప్రపంచంలో టెస్లా పేరు మారుమ్రోగిపోతుంది. కేవలం టెక్నాలజీని జోడించి తయారు చేసిన ఎలెక్ట్రిక్ వెహికిల్ ఇది. అయితే టెస్లాని ఇండియాలో ప్రవేశపెట్టాలని మస్క్ ప్రయత్నం చేశాడు. గతంలో భారత ప్రభుత్వం నిరాకరించడంతో వెనక్కు తగ్గిన మస్క్ ఇప్పుడు మోడీతో భేటీ అయ్యేందుకు సిద్దమయ్యాడు.
ప్రధాని మోడీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నాడు. నరేంద్ర మోదీ యుఎస్ పర్యటన సందర్భంగా ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు మరియు టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్‌ను కలుసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఒక అమెరికన్ మీడియాకు ఇచ్చిన మస్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియాలో టెస్లా ఏర్పాటు గురించి ప్రశ్న అడిగారు. దానికి మస్క్ స్పందిస్తూ.. మేము ఖచ్చితంగా భారతదేశంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాము. ఈ సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో టెస్లా కోసం స్థలం కూడా నిర్ణయిస్తామని చెప్పాడు. ఈ క్రమంలో మస్క్ మోడీతో భేటీ అయి చర్చలు జరపనున్నారు. అయితే ఇప్పటికే ఇండియాలో టెస్లా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. మోడీతో చర్చల అనంతరం ఎంఓయూ కూడా జరగనున్నట్టు తెలుస్తుంది.
Read More: Wife-Husband-7 Coin Bags : భార్యకు భరణంగా రూ.55వేల కాయిన్స్