Bajaj Chetak EV : బజాజ్ చేతక్.. గతంలో ఈ స్కూటరుకు లభించిన క్రేజ్ అంతాఇంతా కాదు. జరిగిన సేల్స్ అన్నీఇన్నీ కావు. వాస్తవానికి చాలా ఏళ్ల క్రితమే దీని తయారీని బజాజ్ కంపెనీ ఆపేసింది. అయినా నేటికీ చాలాచోట్ల ఈ స్కూటరును వాడుతున్న వాళ్లను మనం చూస్తుంటాం. డిసెంబర్ 20వ తేదీన సరికొత్త బజాజ్ చేతక్‌తో వాహన ప్రియులను బజాజ్ ఆటో పలకరించబోతోంది. అయితే ఈసారి బజాజ్ చేతక్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ (ఈవీ) వర్షన్‌ను విడుదల చేయనున్నారు.
Also Read :Sam Pitrodas Phone Hacked : శామ్ పిట్రోడా ఫోన్, ల్యాప్‌టాప్ హ్యాక్.. ముడుపులు అడుగుతున్న హ్యాకర్లు
వాస్తవానికి 2020 సంవత్సరంలోనే బజాజ్ చేతక్ ఈవీని(Bajaj Chetak EV) విడుదల చేశారు. దాని సేల్స్ గణనీయంగా పెరిగాయి. వాహన ప్రియుల నుంచి పెద్దసంఖ్యలో ఆర్డర్స్ వచ్చాయి. దీంతో ఈసారి బజాజ్ చేతక్ ఈవీలోనే ఇంకో నూతన వర్షన్‌ను విడుదల చేయబోతున్నారు. ఇందులో అధునాతన ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. ఆకర్షణీయమైన లుక్‌లో ఈ సరికొత్త స్కూటర్ ఉంటుందని అంటున్నారు. ఈ స్కూటరులో ఫ్లోర్‌బోర్డ్ కింద బ్యాటరీ ప్యాక్‌ను ఉంచడం వల్ల కార్గో స్పేస్ పెరుగుతుంది. త్వరలో విడుదల కానున్న బజాజ్ చేతక్ సరికొత్త ఈవీ వర్షన్‌ను ఒకసారి ఛార్జింగ్ చేస్తే 137 కిలోమీటర్ల దాకా ప్రయాణించవచ్చు. దీని ధరలు వేరియంట్, రంగులను బట్టి రూ.96వేల నుంచి రూ.1.29 లక్షల మధ్య ఉంటాయని తెలిసింది.
Also Read :Cock Fighting : సంక్రాంతికి పందెం కోళ్లు రెడీ.. స్పెషల్ ఫుడ్‌తో ట్రైనింగ్.. హైరేంజులో రేట్లు
ఈవీ స్కూటర్స్, బైక్స్ విభాగంలో ఇప్పుడు పోటీ పెరిగింది. ఓలా టాప్ ప్లేసులో ఉంది. తర్వాతి స్థానాల్లో టీవీఎస్, బజాజ్, ఏథర్ ఉన్నాయి. బజాజ్ కంపెనీ ఈవీల విక్రయాల్లో క్రమంగా తన మార్కెట్ వాటాను పెంచుకుంటోంది. కొత్తగా విడుదల కానున్న బజాజ్ చేతక్ ఈవీ సేల్స్ కూడా భారీగానే జరుగుతాయని అంచనా వేస్తున్నారు. నూతన సంవత్సరం ఆరంభంలో పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తాయని బజాజ్ కంపెనీ అంచనా వేస్తోంది. అదే జరిగితే.. ఓలా స్కూటర్ల అమ్మకాలు నెగెటివ్‌గా ప్రభావితమయ్యే అవకాశాలు లేకపోలేదు.