Site icon HashtagU Telugu

New Maruti Dzire: మార్కెట్‌లోకి మారుతి డిజైర్ కొత్త కారు.. లాంచ్ ఎప్పుడంటే..?

New Maruti Dzire

New Maruti Dzire

New Maruti Dzire: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ప్రస్తుతం తన కొత్త డిజైర్ (New Maruti Dzire) ఫేస్‌లిఫ్ట్ గురించి వార్తల్లో నిలుస్తోంది. ఈ కారుకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు వస్తున్నాయి. కొత్త డిజైర్ వచ్చే నెలలో లాంచ్ అవుతుందని ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే నవంబర్‌లో లాంచ్ అవుతుందని స‌మాచారం. కానీ లాంచ్ డేట్ గురించి కంపెనీ సమాచారం ఇవ్వలేదు. ఈసారి అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కొత్త డిజైర్‌లో చోటు సంపాదించవచ్చు. డిజైర్ మారుతి సుజుకి అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ సెడాన్ కారు.

Z-సిరీస్ ఇంజిన్

నివేదికల ప్రకారం.. కొత్త డిజైర్‌లో అతిపెద్ద మార్పు దాని ఇంజిన్‌లో ఉంటుంది. ఈసారి కొత్త మోడల్ కొత్త Z-సిరీస్ 3 సిలిండర్ ఇంజిన్‌ను పొందుతుంది, ఇది 82 hp శక్తిని, 112 Nm టార్క్‌ను ఇస్తుంది. ప్రస్తుతం ఈ ఇంజన్ స్విఫ్ట్‌కు శక్తినిస్తుందని మ‌న‌కు తెలిసిందే. ఈ ఇంజిన్ దాని పనితీరు, మంచి మైలేజీకి ప్రసిద్ధి చెందింది. ఈ ఇంజన్ స్విఫ్ట్‌లో 26kmpl మైలేజీని అందిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో డిజైర్‌లో ఈ ఇంజన్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇది సుమారుగా 25km నుండి 27kmpl మైలేజీని అందించగలదని భావిస్తున్నారు.

Also Read: Star Health Vs Telegram : టెలిగ్రాంపై స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ దావా.. ఎందుకంటే ?

వివరాల్లోకి వెళితే.. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. కొత్త డిజైర్ CNGలో కూడా అందించబడుతుంది. దీని మైలేజ్ 30km/kg వరకు ఉంటుంది. కానీ కారులో ఒకే ఒక్క CNG ట్యాంక్ మాత్రమే ఉండ‌నుంది. ఇప్పటి వరకు మారుతి సుజుకిలో ట్విన్ సిఎన్‌జి ట్యాంక్ లాంటి ఫీచర్ లేదు. అయితే భవిష్యత్తులో కంపెనీ ట్విన్ సిఎన్‌జి ట్యాంక్‌తో వెళ్లవచ్చని.. టాటా, హ్యుందాయ్‌లకు ఈ సాంకేతికత ఉందని భావిస్తున్నారు.

మారుతి సుజుకి ఈ కొత్త డిజైర్‌లో భద్రతపై పూర్తిగా దృష్టి సారిస్తోంది. అందువల్ల భద్రత కోసం అనేక మంచి, ఫ‌స్ట్ క్లాస్ లక్షణాలను కొత్త మోడల్‌లో చేర్చవచ్చు. ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్) భద్రతా ఫీచర్లను కొత్త డిజైర్‌లో చూడవచ్చు. హైబ్రిడ్ టెక్నాలజీని మొదటిసారిగా చేర్చవచ్చు. రాబోయే కొద్ది సంవత్సరాల్లో మారుతీ తన అన్ని కార్లను హైబ్రిడైజ్ చేస్తుందని స‌మాచారం. అయితే ఇదే జరిగితే కార్లు కూడా ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది.

ప్రస్తుతం డిజైర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.56 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మూలాల ప్ర‌కారం.. కొత్త మోడల్ ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అధిక ధరకు కారణం ఇందులో లభించే ఫీచర్లు. భారతదేశంలో ఈ కారు నేరుగా హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరాతో పోటీపడనుంది.