Site icon HashtagU Telugu

Kia Car : త్వరలో మార్కెట్లోకి రాబోతున్న కియా సరికొత్త కారు.. అద్భుతమైన ఫీచర్స్ తో గ్రాండ్ లాంచ్..

Kia EVs

New Kia Car Coming Soon In The Market.. Grand Launch With Amazing Features..

New Kia Car Grand Launch : ప్రముఖ కొరియన్‌ ఆటో దిగ్గజం కియా సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి అనేక రకాల కార్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లలో మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది కియా (Kia). ఈ నేపథ్యంలోనే త్వరలో అనగా 2024లో భారత్ లోకి వరుసగా మూడు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈవీ 9 లను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది తన భారతదేశ ప్రణాళికలను వెల్లడిస్తూ కొత్త తరం కార్నివాల్‌తో పాటు ఈవీ 9ను విడుదల చేస్తున్నట్లు కియా (Kia) కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం టాటా మోటర్స్‌ ఆధిపత్యంలో ఉన్న భారతదేశంలో ప్రయాణికులు ఈవీ విభాగంలో సుమారు 15 శాతం మార్కెట్‌ వాటాను సాధించాలంటే ఈవీ9 కీలకంగా ఉంటుందని తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

మరి ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాల విషయానికొస్తే.. కియా ఈవీ9 ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్‌ రూపంలో గతంలో భారతదేశంలో ప్రదర్శించారు. కియా హోమ్‌ బేస్‌ దక్షిణ కొరియాతో సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లోని మార్కెట్స్‌లో రిలీజ్‌ చేశారు. అయితే గతంలో కియా 2025 నాటికి భారతదేశంలో ఈవీ9 రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించినా తాజాగా ఈ కారును 2024 లోనే లాంచ్‌ చేస్తున్నట్లు వివరించింది. అయితే 2025 నాటికి మాత్రం మూడు కొత్త ఈవీలను లాంచ్‌ చేస్తామని మాత్రం కియా ప్రతనిధులు వెల్లడించారు. ఇకపోతే కియా ఈవీ 9 విషయానికి వస్తే.. ఈ కారు ఎలక్ట్రిక్‌ గ్లోబల్‌ మాడ్యులర్‌ ప్లాట్‌ఫారమ్‌ పై ఆధారపడి పని చేస్తుంది.

కియా మొదటి కారు అయిన కియా ఈవీ 6 కంటే ఈవీ9 పొడవు 5 మీటర్లు ఎక్కువ. ఈ కారు గ్లోబల్‌ ఎస్‌యూవీ టెల్లూరైడ్‌తో పోల్చుకుంటే సమాన నిష్పత్తిలో ఉంటుంది. ఈ కారు ఆరు లేదా ఏడు సీట్ల కాన్ఫిగేరేషన్‌లతో వస్తుంది. అలాగే కియా ఈవీ 9 కారు 541 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ కారు 150 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్‌ మోటర్‌తో పనిచేయడం వల్ల 9.4 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. కియా ఈవీ 9 ఆర్‌డబ్ల్యూడీ వెర్షన్‌ ద్వారా ఆకట్టుకుంటుంది. ఈవీ 800 వోల్ట్‌ ఎలక్ట్రిక్‌ ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ కారు హై స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కెపాసిటీతో వస్తుంది. ఈ కారును కేవలం 15 నిమిషాలు చార్జింగ్‌తో 239 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. కియా ఈవీ 9 జీటీ హైవేలపై హ్యాండ్‌ ఫ్రీ రైడింగ్‌ను అందించే 3 ఏడీఏఎస్‌ను అందిస్తుంది. అలాగే ఈ కారను 360 డిగ్రీ వ్యూయింగ్‌ కోసం ఏడీఏఎస్‌ కారు చుట్టూ రెండు లైడార్‌, రాడార్‌, కెమెరాలతో సహా 15 సెన్సార్ల ద్వారా సాయం చేస్తుంది.

Also Read:  Egg Masala Fry: పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ మసాలా ఫ్రై.. సింపుల్ ట్రై చేయండిలా?