MG Windsor: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న ఆదరణ మధ్య MG Windsor సరికొత్త చరిత్ర సృష్టించింది. JSW MG మోటార్ ఇండియాకు చెందిన ఈ ఎలక్ట్రిక్ కారు 2025 సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన నంబర్-1 EVగా నిలిచింది. విశాలమైన స్థలం, ప్రీమియం కంఫర్ట్, అద్భుతమైన ‘వాల్యూ ఫర్ మనీ’ ఆఫర్‌లతో MG Windsor కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడమే కాకుండా ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
MG Windsor.. భారతదేశపు నంబర్-1 ఎలక్ట్రిక్ కారు
JSW MG మోటార్ ఇండియా గణాంకాల ప్రకారం.. 2025 సంవత్సరంలో MG Windsor మొత్తం 46,735 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. భారతీయ 4-వీలర్ EV విభాగంలో ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా ఈ స్థాయి అమ్మకాలను సాధించలేదు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో MG Windsor భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా రికార్డు సృష్టించింది.
కుటుంబాలకు మొదటి ఎంపికగా ఎందుకు మారింది?
MG Windsorను ముఖ్యంగా ఫ్యామిలీ కారుగా ప్రజలు ఎంతో ఇష్టపడుతున్నారు. ఇందులో లభించే విశాలమైన క్యాబిన్ స్పేస్, సౌకర్యవంతమైన సీటింగ్, ఫీచర్లతో నిండిన ఇంటీరియర్ దీనికి ప్రధాన కారణాలు. దీని డ్రైవింగ్ అనుభవం కూడా చాలా స్మూత్‌గా, నమ్మదగ్గదిగా ఉంటుంది. అందుకే ఈ కారు నేడు భారతదేశంలో అత్యధిక అవార్డులు గెలుచుకున్న EVగా నిలిచింది.
Also Read: బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్.. ఏపీ ట్రాన్స్‌కో నుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది..!
MG మోటార్ ఇండియా అద్భుతమైన వృద్ధి
మొత్తం వృద్ధి: 2025 క్యాలెండర్ ఇయర్లో MG మోటార్ ఇండియా మొత్తం 19 శాతం వృద్ధిని సాధించింది.
EV విభాగంలో వృద్ధి: 2024తో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో అమ్మకాలు ఏకంగా 111 శాతం పెరిగాయి.
వ్యాప్తి: మెట్రో నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో కూడా MG EVలకు డిమాండ్ భారీగా పెరిగింది.
MG Windsor- ప్రత్యేకతలు, ధర
MG Windsorను భారతదేశపు మొట్టమొదటి ‘ఇంటెలిజెంట్ CUV’గా పరిచయం చేశారు. ఇది సెడాన్ లాంటి పొడవును SUV లాంటి దృఢత్వాన్ని కలిగి ఉంటుంది.
ధర: ‘BaaS’ (Battery-as-a-Service) మోడల్ కింద ఈ కారు ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు. దీనికి కిలోమీటరుకు రూ. 3.9 చొప్పున ఛార్జీ ఉంటుంది.
పర్ఫార్మెన్స్: ఇది 100 kW (136 PS) పవర్‌ను, 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
బ్యాటరీ- రేంజ్: 38 kWh బ్యాటరీ, 332 కి.మీ రేంజ్ ఇస్తుంది.
52.9 kWh బ్యాటరీ (PRO వేరియంట్): ఇది గరిష్టంగా 449 కి.మీ రేంజ్ ఆఫర్ చేస్తుంది.
ప్రీమియం ఇంటీరియర్, స్మార్ట్ ఫీచర్లు
డిజైన్: దీని ‘AeroGlide’ డిజైన్ కారుకు ఒక ఆధునిక రూపాన్ని ఇస్తుంది.
బిజినెస్ క్లాస్ కంఫర్ట్: ఇందులో ఉన్న ‘Aero Lounge’ సీట్లను 135 డిగ్రీల వరకు వంచుకోవచ్చు. ఇది సుదీర్ఘ ప్రయాణాలను చాలా సుఖమయం చేస్తుంది.
టెక్నాలజీ: సెంటర్ కన్సోల్‌లో 15.6 అంగుళాల అతిపెద్ద GRANDVIEW టచ్ డిస్ప్లే ఇచ్చారు. ఇది డ్రైవింగ్‌ను మరింత స్మార్ట్‌గా మారుస్తుంది.
