Geared Electric Motorcycle: భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో ఇప్పటివరకు స్కూటర్లదే పైచేయిగా ఉంది. కానీ మోటార్‌సైకిల్ విభాగంలో ఇప్పుడు మార్పు మొదలైంది. ఈ మార్పులో భాగంగా Matter Era 5000 Plus ఒక ప్రత్యేకమైన మోడల్‌గా నిలుస్తోంది. ఎలక్ట్రిక్ బైక్ అయినప్పటికీ ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్‌ను అందించడం విశేషం. ఈ ఫీచర్ దీనిని మిగిలిన ఎలక్ట్రిక్ బైక్‌ల కంటే భిన్నంగా ఉంచుతూ సాంప్రదాయ పెట్రోల్ బైక్ నడుపుతున్న అనుభూతిని కలిగిస్తుంది.
ఫ్యూచరిస్టిక్ డిజైన్ – స్పోర్టీ లుక్
Matter Era 5000 Plus డిజైన్ పూర్తిగా ఆధునికంగా, ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది.
ముందు భాగం: ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్, LED DRLలు దీనికి షార్ప్- అగ్రెసివ్ లుక్‌ని ఇస్తాయి.
బాడీ: యాంగిల్డ్ డిజైన్ బాడీ ప్యానెల్స్ వల్ల బైక్ ఆగి ఉన్నప్పుడు కూడా స్పోర్టీగా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో ఫ్యూయల్ ట్యాంక్ లాగా కనిపించే భాగం నిజానికి బ్యాటరీని కవర్ చేస్తుంది.
ఫీచర్లు: స్ప్లిట్ సీట్ సెటప్, అల్లాయ్ వీల్స్, టేపర్డ్ టెయిల్ సెక్షన్ దీని డిజైన్‌ను పూర్తి చేస్తాయి.
7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్: డిజిటల్ కంట్రోల్ సెంటర్
ఈ బైక్ ప్రధాన ఆకర్షణ దీని 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్ డిస్ప్లే.
ఇది కేవలం వేగం, బ్యాటరీ స్థాయి, ట్రిప్ వివరాలను మాత్రమే కాకుండా స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్లు, MapMyIndia ద్వారా నావిగేషన్‌ను కూడా అందిస్తుంది. రైడర్ తన అవసరానికి అనుగుణంగా స్క్రీన్ లేఅవుట్‌ను మార్చుకోవచ్చు. ఇందులో బైక్ సమాచారాన్ని ఇచ్చే వీడియోలు, సెట్టింగ్స్ మెనూ కూడా ఉన్నాయి.
5 kWh బ్యాటరీ- లిక్విడ్-కూల్డ్ సిస్టమ్
Matter Era 5000 Plusలో 5 kWh బ్యాటరీ ఉంది. సాధారణంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్లలో తక్కువగా కనిపించే లిక్విడ్-కూలింగ్ సిస్టమ్ ఇందులో ఉండటం ఒక సాంకేతిక బలం. బ్యాటరీ- మోటార్‌పై లోడ్ పడినప్పుడు కూడా ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. ఇందులో 10.5 kW పర్మనెంట్ మాగ్నెట్ మోటార్ ఉంది. దీనికి 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేయబడింది. ఇది రైడర్‌కు గేర్లు మార్చే అనుభూతిని, ఇంజన్ బ్రేకింగ్ వంటి కంట్రోల్‌ను అందిస్తుంది.
Also Read: 8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?
రైడింగ్ మోడ్స్- పర్ఫార్మెన్స్
ఇందులో Eco, City, Sport అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.
టాప్ స్పీడ్: స్పోర్ట్ మోడ్‌లో గంటకు 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.
వేగం: 0 నుండి 60 కి.మీ వేగాన్ని కేవలం 6 సెకన్లలో అందుకుంటుంది. ఇది సిటీ ట్రాఫిక్‌తో పాటు హైవే రైడింగ్‌కు కూడా సరిపోతుంది.
సస్పెన్షన్, బ్రేకింగ్- హ్యాండ్లింగ్
సస్పెన్షన్: ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు ట్విన్ గ్యాస్-చార్జ్డ్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి.
కంఫర్ట్: దీని సీటు ఎత్తు 790 mm, దీనివల్ల సగటు ఎత్తు ఉన్న వారు కూడా బైక్‌ను సులభంగా బ్యాలెన్స్ చేయవచ్చు. దీని బరువు 169 కిలోగ్రాములు.
ధర- మార్కెట్ స్థానం
Matter Era 5000 Plus ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.84 లక్షలు. ధర పరంగా ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలోకి వస్తుంది.
