Maruti Suzuki: మారుతి సుజుకి (Maruti Suzuki) ఇండియా ఈ పండుగ సీజన్‌లో తమ కార్లపై అనేక డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. దీంతో పాటు వినియోగదారులు జీఎస్టీ కోత ప్రయోజనాన్ని కూడా పొందుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో నెంబర్-1 కారుగా ఉన్న వ్యాగన్ఆర్ (WagonR)ను కొనుగోలు చేయడం ఇప్పుడు మరింత చౌకగా మారింది. దీపావళి సందర్భంగా, వ్యాగన్ఆర్ కారుపై రూ. 75,000 వరకు ప్రయోజనాలు (బెనిఫిట్స్) అందుబాటులో ఉన్నాయి. ఇందులో నగదు తగ్గింపు (Cash Discount)తో పాటు స్క్రాపేజ్ అలవెన్స్, ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి.
మారుతి వ్యాగన్ఆర్ ధర ఎంత తగ్గింది?
జీఎస్టీ కోతకు ముందు మారుతి వ్యాగన్ఆర్ LXI వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5 లక్షల 78 వేల 500గా ఉండేది. ఇప్పుడు ఈ కారు ధరలో రూ. 79 వేల 600 తగ్గింది. దీంతో మారుతి వ్యాగన్ఆర్ ధర ఇప్పుడు రూ. 4 లక్షల 98 వేల 900గా ఉంది. మారుతి వ్యాగన్ఆర్ ప్రధానంగా టాటా టియాగో (Tata Tiago), సిట్రోయెన్ సి3 (Citroen C3), మారుతి సెలెరియో (Maruti Celerio), మారుతి ఆల్టో కె10 (Maruti Alto K10) వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.
Also Read: Digital Payments: రేపటి నుండి UPI చెల్లింపుల్లో పెను మార్పు!
మారుతి వ్యాగన్ఆర్ పవర్‌ట్రెయిన్ ఎలా ఉంది?
మారుతి వ్యాగన్ఆర్‌లో మూడు ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
- 1.0 లీటర్ పెట్రోల్
- 1.2 లీటర్ పెట్రోల్
- 1.0 లీటర్ పెట్రోల్ + CNG
దీని పెట్రోల్ వెర్షన్ లీటర్‌కు 25.19 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. అయితే CNG వెర్షన్ 34.05 Km/kg వరకు మైలేజీ ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు రెండూ అందుబాటులో ఉన్నాయి. దీని వల్ల ఈ కారును పట్టణాల్లో, హైవేలపై కూడా సౌకర్యవంతంగా నడపవచ్చు.
కారులో లభించే ముఖ్య ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే.. మారుతి వ్యాగన్ఆర్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో- ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది. ఇందులో కీలెస్ ఎంట్రీ, పవర్ విండోస్, 341 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ కూడా అందించబడ్డాయి. భద్రత విషయంలో వ్యాగన్ఆర్ ఇప్పుడు గతంలో కంటే మరింత సురక్షితంగా మారింది. ఎందుకంటే ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తాయి. వీటితో పాటు ABSతో EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), రియర్ పార్కింగ్ సెన్సార్, రియర్ కెమెరా వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.
