Site icon HashtagU Telugu

Mahatma Gandhi: జాతిపిత గాంధీ ప్రయాణించిన చారిత్రక కార్లు ఇవే!

Mahatma Gandhi

Mahatma Gandhi

Mahatma Gandhi: జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) చేసిన గొప్ప కృషిని ఎప్పటికీ మర్చిపోలేం. భారతదేశ స్వాతంత్య్రం కోసం గాంధీ దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేశారు. ఇందుకోసం ఆయన వివిధ ప్రాంతాలకు ప్రయాణించేవారు. గాంధీ జయంతి సందర్భంగా బాపు ప్రయాణించి, వాటికి గౌరవాన్ని పెంచిన కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వాహనాల్లోనే మహాత్మా గాంధీ దేశంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి ఉద్యమాలు నడిపేవారు. వీటిలో చాలా కార్లు గాంధీజీకి సన్నిహితులైన వారివే.

ఫోర్డ్ మోడల్ A కన్వర్టిబుల్ కార్ (Ford Model A Convertible Car)

ఈ జాబితాలో మొదటిది ‘ఫోర్డ్ మోడల్ A కన్వర్టిబుల్ కార్’. 1940లో జరిగిన రామ్‌గఢ్ (Ramgarh) సమావేశం (అధివేశన్) సందర్భంగా గాంధీజీ ఈ కారులో ప్రయాణించారు. ఈ కారు రాంచీకి చెందిన రాయ్ సాహెబ్ లక్ష్మీ నారాయణ్ గారిది. ఆయన దీనిని 1927లో ప్రత్యేకంగా తన కోసం తెప్పించారు.

పాకార్డ్ 120 (Packard 120)

రెండవ విలాసవంతమైన కారు ‘పాకార్డ్ 120’. దీనిని 1940లో కొనుగోలు చేశారు. గాంధీజీ ఎక్కువ దూరం ప్రయాణించింది ఈ కారులోనే. దీని యజమాని గాంధీజీకి మంచి స్నేహితులైన ఘనశ్యామ్‌దాస్ బిర్లా.

Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

ఫోర్డ్ మోడల్ T (Ford Model T)

మూడవ కారు ఫోర్డ్ మోడల్ T. 1927లో రాయ్‌బరేలి సెంట్రల్ జైలు నుండి విడుదలైనప్పుడు గాంధీజీ ఈ కారులో ప్రయాణించారు. ఈ కారు యజమాని ఎవరో కచ్చితంగా తెలియదు. అప్పటి నుండి ఇప్పటివరకు ఈ వింటేజ్ కారును చాలాసార్లు వేరే వ్యక్తులు కొనుగోలు చేశారు. అనేక ర్యాలీలలో దీనిని వింటేజ్ కారుగా చూడవచ్చు.

స్టూడ్‌బేకర్ ప్రెసిడెంట్ (Studebaker President)

నాల్గవ కారు స్టూడ్‌బేకర్ ప్రెసిడెంట్. గాంధీజీ కర్ణాటక పర్యటన సందర్భంగా ఈ కారును ఉపయోగించారు. ఆ పర్యటన ఆ సమయంలో చాలా ముఖ్యమైనది. 1926-33 మధ్య తయారు చేయబడిన ఈ కారు 90వ దశకంలో ప్రముఖ కార్లలో ఒకటి.

Exit mobile version