Driving Tips : కారు డ్రైవింగ్ కొత్తగా నేర్చుకుంటున్నారా ? కారు డ్రైవింగ్ అనుకున్నంత సులభం కాదు. డ్రైవింగ్ చేయాలంటే ఏకాగ్రతతో పాటు డైరెక్షన్స్ గురించి, ట్రాఫిక్ నియమాల గురించి మంచి అవగాహన ఉండాలి. అందుకే కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న వాళ్లు చాలా విషయాల గురించి తెలుసుకోవాలి. కారుకు సంబంధించిన కీ కంట్రోల్స్ అన్నింటి గురించి డ్రైవింగ్ చేసే వారికి అవగాహన ఉండి తీరాలి. ఈ కీ కంట్రోల్స్ ఎక్కడుంటాయి? ఎలా ఉపయోగపడతాయి? అనే విషయాలు తెలుసుకోవాలి. ఇందుకోసం నిపుణుల సాయం తీసుకోవచ్చు. కారు మాన్యువల్‌ను చదవండి.
We’re now on WhatsApp. Click to Join
బీ అలర్ట్.. నీడ్ కంఫర్ట్
కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సౌకర్యవంతంగా సీటులో కూర్చోండి. కారును స్టార్ట్ చేసే ముందు, మీ ఎత్తు, సౌకర్యానికి అనుగుణంగా సీటును సర్దుబాటు చేసుకోండి. అన్నివైపులా ఉన్న అద్దాలు సరిచూసుకోండి. కొందరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ వాడటమో, సాంగ్స్ వినడమో చేస్తారు. కానీ ఇది మంచిది కాదు. డ్రైవింగ్ సమయంలో పరధ్యానంలో ఉండకూడదు. కొత్తగా డ్రైవింగ్ చేయడం ప్రారంభిస్తే, అందులో నిపుణత సాధించే వరకు మీ పక్కనే అనుభవజ్ఞుడైన డ్రైవర్‌ని కూర్చోబెట్టుకోవాలి.
Also Read : Floating Bridge : వైజాగ్ బీచ్‌లో ‘ఫ్లోటింగ్ బ్రిడ్జ్’.. ప్రత్యేకతలు ఇవిగో
వేగం వద్దు.. బీ రిలాక్స్
డ్రైవింగ్ సమయంలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ట్రాఫిక్ సిగ్నళ్లు ఫాలో కావాలి. ఓవర్ స్పీడ్ మంచిది కాదు. స్పీడ్ లిమిట్స్ దేశదేశానికి మారుతాయి. ప్రాంతాలను బట్టి కూడా స్పీడ్ లిమిట్స్ మారుతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్ సైన్ బోర్డుల్ని గమనించాలి. వేగ పరిమితుల్ని పాటించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. కొత్తగా కారు నడిపేవారికి కాస్త ఆత్రుతగా లేదా ఆందోళనగా ఉంటుంది. ఇలా ఉండటం మంచిది కాదు. కారు నడిపేముందు రిలాక్స్ కావాలి. ప్రశాంతంగా ఉండాలి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏకాగ్రత లోపించినట్లు అనిపిస్తే, వెంటనే కారును ఆపి విశ్రాంతి తీసుకోండి. ఆ తర్వాత మళ్లీ ప్రయాణం మొదలుపెట్టండి.
Also Read : Jharkhand Crisis : జార్ఖండ్‌లో ‘జైపూర్’ దడ.. రాజకీయం ‘హస్త’వ్యస్తం!
ట్రాఫిక్ రద్దీలో వద్దు
కారు డ్రైవింగ్‌ను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నవారు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న టైంలో డ్రైవింగ్ చేయకపోవడమే బెటర్. రాత్రి సమయాల్లోనూ డ్రైవింగ్ జోలికి వెళ్లకండి. లైటింగ్ సమస్యతో డ్రైవ్ చేయడం కష్టంగా ఉంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే, మరోసారి డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లండి.