World’s Fastest Car: గాలితో మాట్లాడే హై స్పీడ్ వాహనాలను ప్రపంచంలోనే హైపర్ కార్లు (World’s Fastest Car)గా పిలుస్తారు. ఈ విభాగంలో వెనమ్ ఎఫ్5 కారును జాన్ హెన్నెస్సీ రూపొందించారు. ఇటీవల కాలిఫోర్నియాలో జరిగిన మోటార్ షోలో ఈ కారును ప్రదర్శించారు. ఈ కారు ధర 22.67 కోట్లు. ఇది రెప్పపాటులో 170కిలోమీటర్ల వేగాన్ని సులభంగా చేరుకుంటుంది.
వెనం ఎఫ్5 హై స్పీడ్ కార్
మీడియా నివేదికల ప్రకారం ఈ సమయంలో జాన్ హెన్నెస్సీ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. వెనమ్ ఎఫ్5 లాంటి వేగంగా కారు నడుపుతూ అందులో కూర్చోవడం వల్ల కలిగే అనుభూతిని ఎవరూ వర్ణించలేరని అన్నారు. కానీ దీనితో పాటు కారు అధిక ధర, వేగానికి సంబంధించి ప్రజలకు రోజువారీ ఉపయోగం కోసం ఇటువంటి హైస్పీడ్ వాహనాలు అవసరం లేదని అతను అంగీకరించాడు. తన కార్వెట్ కారును తానే వాడుతుంటానని చెప్పాడు.
Also Read: Another Pandemic : త్వరలో మహాయుద్ధం.. రాబోయే పాతికేళ్లలో మరో మహమ్మారి.. బిల్‌గేట్స్ జోస్యం
వెనమ్ F5లో V8 ట్విన్ టర్బోస్ ఇంజన్
మార్కెట్లో వెనమ్ ఎఫ్5 కంటే చౌకైన కార్లు చాలానే ఉన్నాయని జాన్ హెన్నెస్సీ తెలిపారు. సమాచారం ప్రకారం.. వెనాన్ ఎఫ్5లో హై స్పీడ్ వి8 ట్విన్ టర్బో ఇంజన్ ఉంది. ఈ శక్తివంతమైన ఇంజన్ 1298 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో గరిష్టంగా 8000rpm ఉత్పత్తి అవుతుంది. కారులో సెమీ ఆటోమేటిక్ ప్యాడిల్ షిఫ్ట్ గేర్ ఛేంజర్ అందించబడింది. కారు పొడవు 4,666mm.. ఇది స్టైలిష్ రూపాన్ని ఇస్తుంది. భద్రత కోసం కారులో ఎయిర్‌బ్యాగ్‌లు, డిస్క్ బ్రేక్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి.
గరిష్ట వేగం గంటకు 420 కి.మీ
బుగట్టి చిరోన్ సూపర్ స్పోర్ట్ మార్కెట్లో వెనాన్ ఎఫ్5తో పోటీపడనుంది. ఈ బుగాట్టి కారు ధర దాదాపు రూ. 28.40 కోట్లు. ఈ కారును త్వరలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ కారు 7998 సిసి పవర్ ఫుల్ ఇంజన్‌తో రానుంది. ఈ కారులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఇవ్వబడింది. ఇది 2 సీట్ల కారు. ఇందులో 1479 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి అవుతుంది. ఈ హైస్పీడ్ కారు 7 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానుంది. ఈ కారులో ఆల్ వీల్ డ్రైవర్ ఉంటుంది, ఈ కారు రోడ్డుపై గంటకు 420 కిమీల వేగాన్ని అందిస్తుంది. ఈ కారు కేవలం 2.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.