Jeep Compass: జీప్ ఇండియా తన ప్రముఖ SUVలైన జీప్ కంపాస్ (Jeep Compass), జీప్ మెరిడియన్ ట్రెయిల్ ఎడిషన్లను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్‌లు ఆఫ్-రోడింగ్ ఔత్సాహికులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. ఈ ట్రెయిల్ ఎడిషన్‌ల విక్రయాలు 15 జులై 2025 నుండి ప్రారంభమయ్యాయి. ఇవి కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. జీప్ ట్రస్ట్ ప్రోగ్రామ్ కింద కస్టమర్లకు ఎక్స్‌క్లూసివ్ ఓనర్‌షిప్ బెనిఫిట్‌లు కూడా అందించనున్నారు. ఈ ఎడిషన్‌లు కంపాస్ లాంగిట్యూడ్ (O), మెరిడియన్ లిమిటెడ్ (O) వేరియంట్‌ల ఆధారంగా రూపొందించారు. డీలర్‌షిప్‌లలో బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ SUVలను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నవారికి ఈ ఎడిషన్‌ల ఫీచర్ల గురించి ఈ ఆర్టికల్‌లో పూర్తిగా తెలుసుకోండి.
జీప్ కంపాస్ ట్రెయిల్ ఎడిషన్ ఫీచర్లు
జీప్ కంపాస్ ట్రైల్ ఎడిషన్‌లో మాట్ బ్లాక్ గ్రిల్, రూఫ్ రైల్స్, రియర్ ఫేసియా యాక్సెంట్ ORVM, న్యూట్రల్ గ్రే కలర్‌లో లోగో ఉంటాయి. అదనంగా ఈ వాహనంపై ట్రైల్ ఎడిషన్ గ్రాఫిక్స్ కూడా కనిపిస్తాయి. కంపాస్ ఫ్రంట్, దిగువ భాగంలో రెడ్ యాక్సెంట్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది. అలాగే 18-అంగుళాల వీల్స్ గ్రానైట్ మెటాలిక్ డ్యూయల్-టోన్ కలర్‌లో ఉంటాయి. ఇంటీరియర్‌లో బ్లాక్ అప్‌హోల్స్టరీలో రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్ దీనికి ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. అదనంగా ట్రైల్ ఎడిషన్ ఆల్-వెదర్ మ్యాట్స్ కూడా ఇవ్వబడ్డాయి. జీప్ కంపాస్ ట్రైల్ ఎడిషన్ ధర రూ. 25.41 లక్షల నుండి రూ. 27.41 లక్షల మధ్య ఉంది.
Also Read: Nimisha Priya: నిమిషా ప్రియా కేసులో బిగ్ ట్విస్ట్.. మరణశిక్ష తప్పేలా లేదు, ఎందుకంటే?
మెరిడియన్ ట్రైల్ ఎడిషన్‌లో లభించే ఫీచర్స్
జీప్ మెరిడియన్ ట్రైల్ ఎడిషన్‌లో కొన్ని ప్రత్యేక ఫీచర్స్ కనిపిస్తాయి. ఈ ఎడిషన్‌లో గ్లాస్-బ్లాక్ రూఫ్ ఉంది. ఇది వాహనానికి ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. అదనంగా ఈ వాహనంలో క్లాడింగ్, ఫాగ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. కొత్త ఎడిషన్‌లో పియానో బ్లాక్ ఫినిషింగ్ కనిపిస్తుంది. దీని ఫ్రంట్‌లో రెడ్ హైలైట్స్, ట్రైల్ ఎడిషన్ డెకాల్స్, బ్యాడ్జ్‌లు కూడా ఇవ్వబడ్డాయి. ఇంటీరియర్ గురించి చెప్పాలంటే.. రెడ్ యాక్సెంట్, ట్రైల్ ఎడిషన్ గ్రాఫియలు ఇంటీరియర్‌లో కనిపిస్తాయి. మెరిడియన్ ట్రైల్ ఎడిషన్ ధర రూ. 31.27 లక్షల నుండి రూ. 37.27 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.