iQOO Neo6: ఆకట్టుకునే డిజైన్ తో ఐక్యూ నియో 6 రిలీజ్..!!

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారుదారీ సంస్థ ఐక్యూ బ్రాండ్ భారత మార్కెట్లోకి నియో 6 స్మార్ట్ ఫోన్ను మంగళవారం రిలీజ్ చేసింది.

  • Written By:
  • Publish Date - June 1, 2022 / 08:38 AM IST

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారుదారీ సంస్థ ఐక్యూ బ్రాండ్ భారత మార్కెట్లోకి నియో 6 స్మార్ట్ ఫోన్ను మంగళవారం రిలీజ్ చేసింది. నియో సిరీస్ లో వచ్చిన మొదటి స్మార్ట్ ఫోన్ ఇది. పవర్ ఫుల్ ప్రొసెసర్, మెరుగైన ఫీచర్లతో గేమర్లను ద్రుష్టిలో పెట్టుకుని ఈ ఫోన్ను డిజైన్ చేశారు.

ఫీచర్ల పరంగా చూస్తే….
స్నాప్ డ్రాగన్ 870 5జీప్రొసెసర్ ను వాడారు. 6.62అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఇందులో ఉంది. బ్యాక్ సైడ్ శామ్ సంగ్ జీడ్ల్యూ 1పి 48మెగాపిక్సెల్ కెమెరా ఏర్పాటు చేశారు. అలాగే 8మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సల్ మైక్రోసెన్సార్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ లో సెల్ఫీల కోసం 16మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. 4,700ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్టుతో వస్తుంది.

ధరలు చూస్తే…
8జీబీ ర్యామ్ , 128జీబీ స్టోరేజీ ధర రూ. 29,999. 12జిబీ 256జీబీ ధర రూ. 33,999. మంగళవారం నుంచే అమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. డార్క్ నోవా, సైబర్ రేంజ్ కలర్స్ లో ఈ ఫోన్లు లభిస్తాయి. రెండేళ్లపాటు ఆండ్రాయిడ్ వెర్షన్లు, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ కు సంస్థ హామీ ఇస్తోంది.