Cars Sales : రాబోయే కొన్నేళ్లలో భారతదేశంలో కార్ల కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోందని.. ప్రజల తలసరి ఆదాయాలు పెరిగి కొద్దీ వాహన కొనుగోళ్లపై ఆసక్తిని పెంచుకునే ఛాన్స్ ఉందని పేర్కొంది. 2035 సంవత్సరం నాటికి భారత్‌లో ప్రతిదినం 12వేల కొత్త కార్లు రోడ్లపైకి వస్తాయని ఐఈఏ తెలిపింది. భారత్‌లో పెరగనున్న కార్ల సంఖ్యకు అనుగుణంగా ఏటా 100 కోట్ల చదరపు మీటర్ల మేర రోడ్ల విస్తీర్ణం పెరుగుతుందని చెప్పింది. ప్రస్తుతం ప్రపంచంలో కార్ల మార్కెట్‌పరంగా భారత్ 5వ స్థానంలో ఉంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ పెరుగుతున్నప్పటికీ.. సాధారణ ఇంధన వాహనాల సేల్స్ (Cars Sales) ఏ మాత్రం తగ్గడం లేదు. 2035 కల్లా భారత్‌లో వాహనాల కోసం కొనుగోలు చేసే పెట్రోలు/డీజిల్ గిరాకీ దాదాపు 40శాతం మేర పెరిగే ఛాన్స్ ఉందని ఐఈఏ పేర్కొంది.
Also Read :Tata Nexon Crash Test Rating: క్రాష్ టెస్టులో 5 పాయింట్లు కొల్లగొట్టిన కొత్త టాటా నెక్సాన్!
ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ నివేదికలోని అంశాలివీ..
- 2035 సంవత్సరం నాటికి భారత్‌లో ఏసీలకు వినియోగించే విద్యుత్, ఆ ఏడాది మెక్సికో దేశ ప్రజలంతా కలిసి వినియోగించే విద్యుత్ కంటే ఎక్కువే ఉంటుందని ఐఈఏ తెలిపింది.
- భారత్‌లో ఇప్పుడు ప్రతిరోజు 5.2 మిలియన్ బ్యారెళ్ల చమురును వాడుతున్నారు. 2035 నాటికి 7.1 మిలియన్ బ్యారెళ్ల చమురు అవసరం అవుతుంది.
- భారత్లోని రిఫైనరీలు ఇప్పుడు రోజుకు 5.8 మిలియన్ బ్యారెళ్లు ముడి చమురును ప్రాసెస్ చేస్తున్నాయి. 2045 సంవత్సరంకల్లా రిఫైనరీల ముడి చమురు ప్రాసెసింగ్ సామర్థ్యం 7.1 మిలియన్ బ్యారెళ్లకు పెరుగుతుంది.
- ప్రస్తుతం భారత్‌లో బొగ్గు ఉత్పత్తి ఏటా 721 మిలియన్ టన్నులు ఉంది. అది 2050 సంవత్సరంకల్లా 645 మిలియన్ టన్నులకు చేరనుంది.
- భారత్‌లో విద్యుత్ గిరాకీ 2035 నాటికి 35 శాతం మేర పెరగనుంది. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1,400 గిగావాట్లకు చేరే ఛాన్స్ ఉంది.
Also Read :Uppada : భయం గుప్పిట్లో ఉప్పాడ ప్రజలు
- భారత్‌లో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి ఎక్కువగా వినియోగించే వనరు బొగ్గు. 2030 సంవత్సరంకల్లా బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి దాదాపు 15 శాతం పెరగనుంది.
- భారత్‌లో సౌర విద్యుత్ ఉత్పత్తితో పోలిస్తే బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి 30 శాతం ఎక్కువగా ఉండనుంది.