Air Travel : బైక్‌లు, కార్లు, రైళ్ల వల్ల నిత్యం వాతావరణం కాలుష్యానికి గురవుతోంది. వాటి నుంచి ఎన్నో కాలుష్య ఉద్గారాలు వాతావరణంలోకి రిలీజ్ అవుతున్నాయి. విమానాల వల్ల కూడా ఇదే విధంగా కాలుష్యం ప్రబలుతోంది. విమానాలు వేగంగా ప్రయాణిస్తే వాటిలోని ఇంధనం వేగంగా దహనం అవుతుంది. దీనివల్ల దాని నుంచి వాతావరణంలోకి రిలీజ్ అయ్యే కాలుష్య ఉద్గారాలు చాలా పెద్దమొత్తంలో ఉంటాయి. ఈ ముప్పును తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి. విమానాల వేగాన్ని కనీసం 15 శాతం మేర తగ్గిస్తే వాటి ఇంజిన్‌లో ఇంధన దహనాన్ని దాదాపు 5 నుంచి 7 శాతం మేర తగ్గించవచ్చని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ తాజా అధ్యయనంలో గుర్తించారు. అయితే ఈ మార్పు వల్ల విమానాల(Air Travel) సగటు ప్రయాణ సమయం అనేది దాదాపు 50 నిమిషాలు పెరిగిపోతుందని తెలిపారు.
Also Read :Suicide Pod : ‘సూసైడ్ పాడ్’తో మహిళ సూసైడ్.. ఏమిటిది ? ఎలా పనిచేస్తుంది ?
ఒకవేళ ఈ సిఫారసులు అమల్లోకి వస్తే.. విమాన ప్రయాణ సగటు వేగం తగ్గిపోతుంది. ఈ సిఫారసు చేయడం వెనుక మరో కారణం కూడా ఉంది. అదేమిటంటే.. భవిష్యత్తులో ప్రపంచ జనాభా మరింత పెరగనుంది. ప్రజల సగటు ఆదాయాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. దీంతో మరెంతో మంది విమాన ప్రయాణాలు చేయనున్నారు. ఈ పరిణామం విమానయాన రంగానికి బాగా కలిసి రానుంది. విమాన సర్వీసులను మరింత ఎక్కువ సంఖ్యలో నడపాల్సి వస్తుంది.
Also Read :Pakistan : దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్తాన్ అని పిలవొద్దు : సుప్రీంకోర్టు
అంటే మరింత ఎక్కువ మోతాదులో కాలుష్య ఉద్గారాలు వాతావరణంలోకి రిలీజ్ అవుతాయి. ఈ ముప్పును తగ్గించాలంటే ఒకే మార్గం ఉందని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. విమానాల వేగాన్ని 10 నుంచి 15 శాతానికి తగ్గిస్తే వాటి నుంచి వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాల మోతాదును తగ్గించవచ్చని సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 10 శాతం మంది మాత్రమే విమాన జర్నీ చేస్తున్నారు.